గ్రీన్ ఎస్ఎం వద్దు బీఎంఎస్ నిరసన
నగరంలోకి ప్రవేశించిన గ్రీన్ ఎస్ఎం వాహనాలతో డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటున్నదని, వియాత్నం కంపెనీనీ రాష్ట్రంలో నిషేధించాలని బీఎంఎస్ డిమాండ్ చేసింది.
- ‘గ్రీన్ ఎస్ఎం’ క్యాబ్స్‌ను బ్యాన్ చేయాలి
నగరంలోకి ప్రవేశించిన గ్రీన్ ఎస్ఎం వాహనాలతో డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటున్నదని, వియాత్నం కంపెనీనీ రాష్ట్రంలో నిషేధించాలని బీఎంఎస్ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా దిల్‌సుక్‌నగర్ , శంషాబాద్, సికింద్రాబాద్ తదితర పలు ప్రాంతాల్లో బీఎంఎస్ నిరసన తెలిపారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఉపాధిని కొల్లగొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఈవీలను ప్రోత్సహించే పేరుతో ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ తమ ఉపాధిని దెబ్బతీస్తున్నదని ఆటో, టాక్సీ డ్రైవర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల తెలంగాణలోకి ప్రవేశించిన వియత్నాం కంపెనీ ‘గ్రీన్ ఎస్ఎం’ ఎలక్ట్రిక్ క్యాబ్‌ల వల్ల రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు ఆదాయం కోల్పోతున్నామని, వెంటనే ఈ సర్వీసులను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఉచిత బస్సు పథకంతో దివాలా తీశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రీన్ ఎస్ఎం కార్యకలాపాలపై 15 రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి ఉంటే వాటిని రద్దు చేయాలని, సంస్థకు కేటాయిం చినట్లు ఆరోపిస్తున్న స్థలాల కేటాయింపులపైనా విచారణ జరిపించాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ప్రతి డ్రైవర్‌కు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఓ కార్యాలయాల ఎదుట నిరవధిక ధర్నాలు చేస్తామని, అవసరమైతే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు కొనుగోలు చేసేందుకు అప్పులు చేసి, వాటి వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వేలాది మంది డ్రైవర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జేబీఎస్, శంషాబాద్ విమానాశ్రయం, దిల్సుఖ్నగర్ వంటి కీలక ప్రాంతాల్లో ఈ గ్రీన్ ఎస్‌ఎంకు ప్రత్యేక స్థలాలు, చార్జింగ్ స్టేషన్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

