బయోలాజికల్ ఇ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు సీడీఎస్‌సీవో గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాక్సిన్, ఫార్మాసూటికల్ కంపెనీ బయోలాజికల్ ఇ లిమిటెడ్ (బీఈ) కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి, రెండో దశ క్లినికల్ ప్రయోగాలాను తాము విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో బీఈ తన వ్యాక్సిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ప్రయోగాలను ప్రారంభించింది.
బీఈ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని, రోగనిరోధక శక్తిని భారీగా పెంచుతోందని రెండు దశల ప్రయోగాల్లో నిరూపితమైనట్లు సంస్థ తెలిపింది. ప్రయోగాల్లో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో ఇచ్చినట్లు చెప్పింది. ఈ ఫలితాలు తమకు చాలా ఆనందం కలిగించినట్లు బీఈ ఎండీ మహిమా దాట్లా చెప్పారు. కొవిడ్‌పై పోరులో తమది కూడా మరో సమర్థవంతమైన వ్యాక్సిన్ అవుతుందన్న ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఇండియాలోని 15 ప్రదేశాల్లో నిర్వహించనున్నట్లు బీఈ ఆ ప్రకనటలో తెలిపింది. ఇందులో భాగంగా 18 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 1268 మందిపై ప్రయోగాలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

