DGP Jitender | సాంకేతిక వనరులను ఉపయోగిస్తూ ఉత్తమ సేవలు అందించాలి : డీజీపీ జితేందర్
DGP Jitender | సాంకేతిక వనరులను ఉపయోగిస్తూ, విజుబులిటీ పోలీసింగ్‌తో ప్రజలతో మమేకమవుతూ ఉత్తమ సేవలు అందించాలని హైదరాబాద్ పోలీసులకు డీజీపీ జితేందర్ సూచించారు.
హైదరాబాద్ : సాంకేతిక వనరులను (Technological resources) ఉపయోగిస్తూ, విజుబులిటీ పోలీసింగ్‌తో ప్రజలతో మమేకమవుతూ ఉత్తమ సేవలు అందించాలని హైదరాబాద్ పోలీసులకు డీజీపీ జితేందర్ (DGP Jitender ) సూచించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు(Festivals) , వివిధ కార్యక్రమాలలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తూ, నేర పరిశోధన నివారణ, రౌడీషీటర్ల(Rowdy Sheeters) నియంత్రణ తదితర అంశాలలో మెరుగైన ఫలితాలు రాబడుతున్నారని అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా పోలీసింగ్(Policing) లో మార్పు వచ్చిందని, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉత్తమ పద్దతులను గ్రహిస్తూ ప్రత్యేకతను కల్గి ఉండాలన్నారు.
హైదరాబాద్ గ్లోబల్, కాస్మో పాలిటన్ నగర మానవ వనరులు, టెక్నాలజీ, భారీగా పెట్టుబడులతో ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ది జరగడం, అత్యంత నివాస యోగ్యమైన నగరంగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత నగదు రహిత ట్రాఫిక్ చలాన్ విధానాన్ని అమలులోకి తెచ్చిన సందర్భంగా ఎదురైన సవాళ్లను ఆయన ప్రస్తావించారు. ప్రజలతో మాట్లాడడం, సున్నితమైన విషయంలో మాట్లాడే సమయంలో ఎవరికి ఇబ్బంది లేకుండా మాట్లాడాలని సూచించారు.
ఫిర్యాదు దారులను తిప్పి పంపకూడదని వారి సమస్యను తెలుసుకోవాలని సూచించారు. విజుబులిటీ పోలీసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ఎన్ఫోర్స్మెంట్, సిగ్నల్స్ వినియోగం సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, విశ్వప్రసాద్, జాయింట్ సీపీ పరిమళ హననూతన్తో పాటు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

