సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి, పలు మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా తరపున శుభాకాంక్షలు తెలిపింది. జిల్లా అధికారులందరూ నూతన ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ నిబద్ధతతో ప్రజా ప్రభుత్వానికి మరింత మంచిపేరు వచ్చేలా కష్టపడి పనిచేసి ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని టీజీవో జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, కార్యదర్శి ఎంఏ ఖాదర్ ఈ సందర్భంగా తెలిపారు.