ఉక్కపోతకు గురవుతున్నారా..? అయితే ఈ ప్రాంతాలకు వెళ్దాం పదండీ..
ఎండలు మండిపోతున్నాయి.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక ఉక్కపోతకు గురవుతున్నారు. వేడి గాలులకు హైదరాబాదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు గ్రీన్ మ్యాట్లు, కూలర్లు, ఏసీలు వినియోగించినప్పటికీ లాభం లేకుండా పోతోంది. చల్లని ప్రాంతాలకు వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.. హైదరాబాద్ చుట్టు పక్కలా చల్లని ప్రదేశాలున్నాయి.. అవేంటో ఓసారి లుక్కేద్దాం మరి..
గండీపేట్ లేక్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గండీపేట్ లేక్ ఉంది. దీన్ని ఉస్మాన్ సాగర్ అని కూడా పిలుస్తారు. హైదరాబాదీలకు ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడ చల్లని వాతావరణం ఉండటంతో ఆహ్లాదకరంగా గడపొచ్చు. ఇక ఫోటో షూట్‌కు ఈ ప్రాంతం ఫేమస్.
శామీర్‌పేట్ లేక్
శామీర్‌పేట్ లేక్ కూడా మంచి పిక్నిక్ స్పాట్. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. స్వచ్ఛమైన గాలిని పొందొచ్చు. అంతే కాదు మీతో పాటు మీ పెంపుడు జంతువులను కూడా అక్కడికి తీసుకెళ్లి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. శామీర్‌పేట్ చెరువుకు సమీపంలోని జింకల పార్కు ఉంది. ఈ పార్కు కృష్ణ జింకలకు నిలయం.
దుర్గం చెరువు..
దుర్గం చెరువు హైదరాబాదీలకు కొత్తేం కాదు.. చెరువును, పార్కును సుందరీకరించిన తర్వాత పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఫోటోషూట్‌కు కూడా ఈ ప్లేస్ ప్రసిద్ధి చెందింది. పచ్చటి చెట్ల మధ్యలో ఏర్పాటు చేసిన బెంచీలపై విశ్రాంతి తీసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్‌లో దుర్గం చెరువుకు వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్లినప్పుడు తప్పకుండా కెమెరా తీసుకెళ్లాల్సిందే.
వీటితో పాటు నెహ్రూ జూలాజికల్ పార్కు, గోల్కొండ ఫోర్ట్, బొటానికల్ గార్డెన్స్ కూడా మంచి పిక్నిక్ స్పాట్స్. ఈ ప్రాంతాల్లో కూడా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపొచ్చు. ఇంకెందుకు ఆలస్యం పిల్లలతో కలిసి అలా విహరించండి..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

