Manabasti- Manabadi | మనబస్తీ- మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లకు ప్రయోజనం : ఎమ్మెల్యే దానం నాగేందర్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలు ప్రయోజనం పొందనున్నాయి.
బంజారాహిల్స్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలు ప్రయోజనం పొందనున్నాయి. నగరంలో ఈ కార్యక్రమాన్ని మన బస్తీ-మన బడిగా వ్యవహరించనున్నారు.
శనివారం మన బస్తీ-మనబడి అమలుపై మంత్రులు తలసాని, మహమూద్ అలీతో పాటు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సమావేశంలో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు మన బస్తీ-మన బడి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సంబంధిత స్కూళ్లకు చెందిన హెడ్మాస్టర్లకు లేఖలు రాసారని, ఆయా పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారన్నారు.
అదనపు తరగతి గదుల నిర్మాణం. టాయ్‌లెట్స్, మంచినీటి సదుపాయాలను కల్పించనున్నామని ఎమ్మెల్యే దానం తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగా మన బస్తీ- మన బడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది కోసం సుమారు 7వేల కోట్ల నిధులను కేటాయించిందని, తొలిదశలో రూ.3497కోట్లను ఖర్చు చేస్తారని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

