హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రూ. కోటి విలువ చేసే నిషేధిత గుట్కా సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. గుట్కా పట్టివేత కేసులో ముగ్గురిని అరెస్టు చేశాం. నిందితుల్లో ఇద్దరు కర్ణాటక వాసులు ఉన్నారు. బేగం బజార్లో లారీలో భారీగా ఉన్న గుట్కా నిల్వలు గుర్తించాం. గుట్కా విక్రయం ముఠాకు చెందిన కొంతమంది పరారీలో ఉన్నారు. నిందితులు నవ భారత్ రోడ్ లయన్స్ పేరుతో ట్రాన్స్ పోర్టు కార్యాలయం నిర్వహిస్తున్నారు. నిషేధిత గుట్కా, పేకాట, క్లబ్బులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వాట్సాప్ ద్వారా 94906 16555 నంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చు.