తక్కువ ధరకే సమతుల ఆహారం

వ్యవసాయ యూనివర్సిటీ : మార్చి 29 : వేసవిలో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు, సేంద్రియ ఎరువులతో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనల మేరకు పండించిన పంటలను వాడటంవల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని విశ్వవిద్యాలయం విద్యార్థులు సూచించారు. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆహార పోషణ విభాగం శాస్త్రవేత్తల సూచనలు, విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణలోనే స్టాల్స్ ఏర్పాటు చేసి రాగులు, జొన్న, సజ్జ, తదితర వాటితో తయారు చేసిన బిస్కెట్స్, బ్రెడ్స్, ఉండలి, జావా తదితర ప్యాకెట్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. రూ.12 నుంచి 110 వరకు ధరలు ఉన్నాయి. ప్రయాణికులే కాకుండా సమీప ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.
వేసవి తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, వడదెబ్బ తగలడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి అనారోగ్యాలు ధరిచేరకుండా రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, భోజనంలో సాంబారు, రసం, సూప్స్ తీసుకోవాలన్నారు. ఈ సీజన్లో అందుబాటులో ఉన్న పుచ్చ, కర్బూజ, ద్రాక్ష, తీసుకోవాలి. కారం, మసాల నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్లు, బేకరీ ఫుడ్ వంటివి వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఉదయం పరిగడపున నీరుతాగడం చాలా మంచిదన్నారు. నాటి నుంచి వినియోగంలో ఉన్న చిరుధాన్యాలు రాగులు, వీటిలో కాల్షియం, పొటాషియం అధికంగా లభిస్తాయి.
వీటిల్లో పిండి పదార్థం, ఖనిజాలవణాలు, ఫ్రోటీన్లు అధికంగా ఉంటాయి. మనకు శక్తినిచ్చే చాలా రకాల ‘బి’ విటమిన్లు ైగ్లెసిమిక్ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రాగులు మధుమేహం రోగులకు మంచి ఆహారం, రాగుల్లో రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షించే లక్షణాలు ఉన్నాయని, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని ఆహార పోషణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త కమలాజా తెలిపారు. సీనియర్ విద్యార్థులు వాటిని తయారు చేసి విక్రయించడం చేస్తున్నారన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- balanced diet
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

