కాచిగూడ : ఆటో డ్రైవర్ అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం గోల్నాక డివిజన్లోని సుందర్‌నగర్ ప్రాంతానికి చెందిన డి.విజయ్‌కుమార్ (26) వృత్తిరిత్యా ఆటోడ్రైవర్.
ఈ నెల 5న ఉదయం విజయ్‌కుమార్ ఆటో తీసుకుని ఇంటి నుంచి వెళ్లి ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు బంధువుల, ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో భార్య సరిత బుధవారం రాత్రి కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
విజయ్‌కుమార్ వేళ్లే సమయంలో ఆకుపచ్చ రంగు షర్ట్, నీలి రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.