హైదరాబాద్ : కారు రేస్‌లు, బైక్ రేస్‌లు చూశాం. కానీ ఆటో రేస్‌లను ఎప్పుడు చూసి ఉండరు. కానీ ఓ ముగ్గురు ఆటోవాలాలు రెచ్చిపోయారు. ఆటోలను గాల్లోకి లేపుతూ ప్రమాదకర విన్యాసాలు చేసి.. వాహనదారులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. అర్ధరాత్రి సమయంలో పాతబస్తీ రోడ్లపై హంగామా చేశారు.
పాత బస్తీలోని సంతోష్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఆటో రేస్‌లతో ఆటోవాలాలు రెచ్చిపోయారు. ఓ ముగ్గురు ఆటోవాలాలు ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడ్డారు. కేకలు వేస్తూ.. ఆటోలను గాల్లోకి లేపుతూ హంగామా సృష్టించారు. కేవలం రెండు చక్రాలతోనే ఆటోలను నడిపి.. అందర్నీ భయభ్రాంతులకు గురి చేశారు. రోడ్డుపై ఇతర వాహనదారులను ఆ ఆటోవాలాలు బేంబెలెత్తించారు. విషయం తెలుసుకున్న ఫలక్‌నూమా పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఓ ముగ్గురు ఆటోవాలాలు రెచ్చిపోయారు. ఆటోలను గాల్లోకి లేపుతూ ప్రమాదకర విన్యాసాలు చేసి.. వాహనదారులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. అర్ధరాత్రి సమయంలో పాతబస్తీ రోడ్లపై హంగామా చేశారు. @HYDTP pic.twitter.com/rOwA1e1kzr
— Namasthe Telangana (@ntdailyonline) February 25, 2022