Online Betting App | ఆటోడ్రైవర్‌ను బలితీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్
Online Betting App | మధ్యప్రదేశ్‌కు చెందిన సోంపాల్ (32) అనే వ్యక్తి 8 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి దుండిగల్ తండా -2 లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
Online Betting App | దుండిగల్, ఏప్రిల్ 18: బెట్టింగ్ యాప్ ఉచ్చులో పడి ఓ ఆటోడ్రైవర్ ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లో గేమ్స్ ఆడి డబ్బులు పోవడంతో మనస్థాపానికి గురైన ఓ ఆటో డ్రైవర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన సోంపాల్ (32) అనే వ్యక్తి 8 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి దుండిగల్ తండా -2 లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడే అలవాటు ఉన్న సోంపాల్ శుక్రవారం రూ.30 వేలు పోగొట్టుకున్నాడు.
అయితే ఈ విషయం ఇంట్లో తన భార్యకు తెలిస్తే గొడవ జరుగుతుందని తీవ్ర మానసిక ఆందోళనకు గురైన సోంపాల్ రాత్రి తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also :
Medical kits | తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హోంగార్డులకు మెడికల్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ
F-15 Jet: ఎఫ్-15 ఫైటర్ జెట్‌లో విహరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్
VD x Shouryuv | ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ.. క్రేజీగా అనౌన్స్మెంట్ పోస్టర్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

