హైదరాబాద్ : నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్లో అడ్వకేట్ మొహినుద్దీన్ హత్యా ప్రయత్నం స్థానికంగా కలకలం రేపింది. తన కారు వద్దకు వెళ్లి డోర్ తీస్తుండగా వెనుక నుంచి ఓ మరో కారులో దుండగులు వేగంగా వచ్చి మొహినుద్దీన్ ఢీకొట్టి పారిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.