Bikes thieves | ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన నిందితులు అరెస్ట్
Bikes thieves | జల్సాలకు అలవాటు పడి దిచక్ర వాహనాలను దొంగతనం(Bikes thieves) చేస్తూ పట్టుబడ్డ నిందితులను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం బోయిన్పల్లి(Boinpally) పోలీస్ స్టేషన్ లో నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియ దర్శిని విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కంటోన్మెంట్,జూన్ 10 : జల్సాలకు అలవాటు పడి దిచక్ర వాహనాలను దొంగతనం(Bikes thieves) చేస్తూ పట్టుబడ్డ నిందితులను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం బోయిన్పల్లి(Boinpally) పోలీస్ స్టేషన్ లో నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియ దర్శిని విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రజాక్ ఖాన్(38) యోహను(30),జి.వెంకటప్పయ్య(28) ముగ్గురు స్నేహితులు కలిసి గత కొంత కాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పార్కింగ్ చేసి ఉన్న 14 ద్విచక్ర వాహనాలను దొంగలించి, నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా విక్రయిస్తున్నారు.
నిందితుల నుంచి రూ.8లక్షల విలువైన ద్విచక్రవాహనాలు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 4 వాహనాలను ఓఎల్ఎక్స్లో నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలోఅదనపు డీసీపీ అశోక్, ఏసీపీ గోపాల కృష్ణమూర్తి, డీఐ సర్దార్ నాయక్, తుల్జీరామ్, శివ శంకర్, రమేష్, మురళి, మహేష్, శివ కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

