వందేండ్ల బామ్మ వైరస్‌ను జయించింది..

ధైర్యం కోల్పోకుండా చికిత్స తీసుకున్న వికాస్‌నగర్‌కు చెందిన ఆండాళమ్మ
తాను కోలుకొని కుటుంబ సభ్యులకు సూచనలు, సలహాలు
ఎల్బీనగర్, మే 10: కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది మృత్యువు ఒడిలోకి చేరుతున్నా వంద ఏండ్ల బామ్మ మాత్రం దిగ్విజయంగా జయించింది. అంతేకాక ఓ వైపు తన పనులు తానే చేసుకుంటూ మరోవైపు తన మనవండ్లు, మనవరాండ్లకు కరోనాపై జాగ్రత్తలు వివరిస్తున్నది. ఆయుర్వేద డాక్టరైన ఈ బామ్మ కరోనా వచ్చిందని తెలిసినా ఎలాంటి ఆందోళన చెందకుండా చికిత్స తీసుకొని కరోనాపై గెలిచింది.
ఇంట్లో ఉంటూనే..
నిజామాబాద్ జిల్లా దివిపేటకు చెందిన ఆండాళమ్మకు ఏలూరుకు చెందిన నర్సింహాచార్యులతో(దివంగత) వివాహం జరగగా.. 120 ఏండ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆండాళమ్మ(100) కు ఏడుగురు సంతానం. ఇందులో ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఆమె సరూర్‌నగర్‌లోని వికాస్ నగర్లో నివసిస్తున్న మూడో కుమారుడు వెంకటాచారి వద్ద ఉంటున్నారు. నలుగురు కుమారులు పౌరోహిత్యం చేస్తుండగా.. మూడో కుమారుడు వెంకటాచారి మాత్రం హైదరాబాద్‌లోని డాక్టర్స్ అసోసియేషన్‌లో స్టాటిస్టికల్ అధికారిగా పని చేసి ఇటీవలే రిటైర్డ్ అయ్యారు. ఇక ఇద్దరు కూతుళ్లు సీతాదేవి, భాగ్యలక్ష్మి వనస్థలిపురంలో ఉంటున్నారు. ఆండాళ్లమ్మకు మనుమలు, మునిమనుమలు కూడా ఉన్నారు.
వైరస్ సోకిందిలా..
వెంకటాచారి కుమార్తె స్వాతి, ఆమె భర్త రఘు మహారాష్ట్రలో ఉంటుండగా కరోనా సోకింది. దీంతో వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి చికిత్స చేయించారు. ఈ క్రమంలో వారి నుంచి ఆండాళమ్మతో పాటు వెంకటాచారి కోడలు సౌమ్యకు కూడా వైరస్ అంటింది. అయితే ఆయుర్వేద వైద్యురాలైన ఆండాళ్లమ్మ వైరస్ సోకిందని తెలిసినా అధైర్యపడలేదు. తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు సిద్ధమైంది. డాక్టర్ల సూచనలు, సలహాలు తీసుకుంటూ.. వారిచ్చిన మందులు వాడుతూ కరోనాను జయించింది. అంతటితో ఆగకుండా వారి కుటుంబ సభ్యులకు కరోనాపై జాగ్రత్తలు వివరిస్తున్నది. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా నెగిటివ్ వచ్చింది.
ఎంతో ధైర్యంగా..
100 ఏండ్ల వయసులోనూ కరోనాను జయించిన బామ్మను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ బామ్మను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు. ఆండాలమ్మ స్వతహాగా ఆయుర్వేద వైద్యం చేస్తారు. ఆమె తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంది. పాటలు రాయడంతో పాటుగా రాగయక్తంగా పాడుతుంది. కరోనా వచ్చినప్పుడు ధైర్యం వీడకుండా ఉండి వైద్యం తీసుకుంటూ కోలుకుంది. పలువురికి ఆదర్శంగా నిలిచింది.
కరోనా అంటే భయపడొద్దు..
కరోనా వచ్చిందని భయపడొద్దు. ధైర్యంగా మహమ్మారిని ఎదుర్కోవాలి. డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటించా. మందులు వేసుకున్నా. మానసిక ధైర్యాన్ని పెంచుకోవడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. – ఆండాళమ్మ
అమ్మమ్మే మాకు స్ఫూర్తి..
మా అమ్మమ్మే మాకు స్ఫూర్తి.. ఆమె ఆయుర్వేద డాక్టర్ అయినందునే కరోనాను జయించింది. వైరస్ సోకిందని తెలిసి కూడా ధైర్యం కోల్పోలేదు. మేమందరం భయపడుతుంటే ఆమె మాత్రం మాకే ధైర్యం చెప్పేది. ఐదు తరాలు చూసిన ఆమె కరోనాను జయించడం ఆనందంగా ఉంది. – ప్రణవి, మనవరాలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- andalamma
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

