Y.K. Designer Fabrics Studio | హైదరాబాద్ : ప్రతి ఒక్కరికీ ఆధునిక ఫ్యాషన్ అందించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలోని హైదర్నగర్లో గల వై.కె. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ స్టూడియోను ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రవి, జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. వై.కె. డిజైనర్ ఫ్యాబ్రిక్ స్టూడియో చాలా కాలం నుంచి తెలుసు. నాకు ఎప్పటినుంచో ఈ స్టూడియో మంచి ఔట్ లుక్ డిజైన్స్ అందిస్తుంది. మనకు నచ్చిన విధంగా బడ్జెట్లో మంచి డిజైన్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి అని రవి తెలిపారు. ఇక రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. వై.కె. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ స్టూడియో చాలా కాలం నుంచి తెలుసు. వీళ్ళ దగ్గర అని విధాలా డిజైన్లు ఉంటాయని వెల్లడించాడు.
ఫ్యాబ్రిక్ స్టూడియో ప్రతినిధులు యశ్వంత్ & కౌశల్య మాట్లాడుతూ.. మాకు ఎప్పటినుంచో ఆలోచన ఉంది. ఇక్కడ స్టోర్ పెట్టాలని.. చాలామంది ఆన్ లైన్ లో ఫ్యాబ్రిక్స్ కొని మోసపోతున్నారు. మా దగ్గర నెంబర్ 1 క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక యాంకర్ రవి, జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ వచ్చి మా స్టూడియో ప్రారంభించినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకోచ్చారు.
Y.K. Designer Fabrics Studio
Y.K. Designer Fabrics Studio
Y.K. Designer Fabrics Studio
Y.K. Designer Fabrics Studio