త్వరలో పాఠశాల అభివృద్ధికి నిధుల కేటాయింపు : ఎమ్మెల్యే సాయన్న
ఎమ్మెల్యే సాయన్న | త్వరలోనే కార్ఖానాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు.

కంటోన్మెంట్ : త్వరలోనే కార్ఖానాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు బుధవారం మూడో వార్డులోని కార్ఖానా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే సాయన్న సందర్శించారు. ఈ సందర్భంగా టీకాలకు సంబంధించిన విషయాలతో పాటు పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. పాఠశాలను సుందీకరణ చేసేందుకు కావాల్సిన నిధులను తన కోటా ద్వారా త్వరలోనే మంజూరు చేయిస్తానని చెప్పారు. కరోనా కారణంగా పాఠశాలలు ఇన్నాళ్లు తెరుచుకోకపోవడంతో పాఠశాలల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, రెండు రోజుల్లో పాఠశాల మెరుగు కోసం పనులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు సాయికిరణ్, నివేదిత, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

