రేడియల్లో గోల్మాల్
బిగ్ బ్రదర్స్ కమీషన్ల బాగోతం.. చర్చనీయాంశంగా హెచ్జీసీఎల్ టెండర్లు
సిటీబ్యూరో, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ) : రేవంత్ రెడ్డి సరార్ అవలంభిస్తున్న టెండర్ల విధానంపై కాంట్రాక్టర్ల వర్గాల్లో ఎప్పటినుంచో ఉన్న అనుమానాలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి. హెచ్ఎండీఏలోని రేడియల్ రోడ్లను కామధేనువులా మార్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి అండ్ బృందం టెండర్ల ప్రక్రియలో భారీ అక్రమాలు తెరలేపింది. అనుకూలమైన ఉన్నతాధికారులను నియమించుకుని, తెరవెనుక కొందరి కనుసన్నల్లోనే దోపిడీ సాగిస్తోంది. ఈ విషయంపై సుశీ ఇన్ఫ్రా చేసిన ఆరోపణలు బట్టబయలు కాగా, ఇప్పుడు ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్.వి.ఎం. కన్ స్ట్రక్షన్స్ చేసిన వ్యాఖ్యలు హెచ్ఎండీఏలో జరుగుతున్న అక్రమ టెండర్ల బాగోతాన్ని బయటపెట్టింది.
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డును అంతర్గత రోడ్లతో కలిపే రేడియల్ రోడ్ల నిర్మాణానికి ఇటీవల టెండర్లు పిలిచారు. సాధారణంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులకు 10 నుంచి 12 ప్రముఖ కంపెనీలు పోటీ పడాల్సి ఉండగా, కేవలం నాలుగు సంస్థలు మాత్రమే (ఎన్సీసీ, బీవీఎస్ఆర్, జీకేసీ, సుశీ ఇన్ ఫ్రా) దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
మిగతా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడమే ఇందుకు అసలు కారణమని స్పష్టమవుతోంది. దీనికి హెచ్ఎండీఏ కమిషనర్, హెచ్జీసీఎల్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం కార్యాలయం, బిగ్ బ్రదర్స్ ముందస్తుగా ఎంపిక చేసిన కంపెనీలకే టెండర్లు కట్టబెట్టేలా వేగంగా ప్రక్రియ ముగించేశారు. సాంకేతిక, ఆర్థిక బిడ్ల మూల్యాంకనాన్ని కేవలం వారంలోనే పూర్తి చేసి, ఫైనాన్షియల్ బిడ్లు తెరిచిన 24 గంటల్లోనే ఎల్వోఏలు జారీ చేయడం ఈ కుట్రకు నిదర్శనంగా నిలిచింది.
సుశీ ఇన్ఫ్రాతో బయటపడిన బాగోతం
కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థ ఈ టెండర్లలో పాల్గొని మూడు ప్యాకేజీలకు బిడ్లు దాఖలు చేసింది. ప్రస్తుత ఎల్-1 బిడ్డర్లు కోట్ చేసిన ధరల కంటే సుశీ ఇన్ఫ్రా దాదాపు రూ. 600 కోట్లు తకువగా కోట్ చేసింది. ఇసుక, కంకర స్థాయి నుంచి చైనా సరిహద్దుల్లోని అత్యంత క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లోనూ ప్రాజెక్టులు పూర్తి చేసిన అనుభవం ఉన్న ఈ సంస్థను కావాలనే టెండర్ల నుంచి అడ్డుకున్నారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన అనుభవ ధృవీకరణ పత్రాన్ని ఎస్ఈ కౌంటర్ సైన్ చేయలేదన్న సాకుతో సుశీ ఇన్ఫ్రాను సాంకేతికంగా అనర్హులుగా ప్రకటించారు. ఒకేరకమైన పనులకు సంబంధించిన ప్రత్యామ్నాయ సర్టిఫికెట్లు సమర్పించినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఆ సంస్థను టెక్నికల్ ఎవాల్యూయేషన్లో తొలగించారు. ఇక్కడ ప్రజాధనం రూ. 600 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే ఈ కుట్ర పన్నారని హెచ్జీసీఎల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అక్రమాలకు వేదికగా హెచ్జీసీఎల్
నిజానికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్లో జరిగే వ్యవహారాలు అంతు చిక్కని అంశాలే. గతంలో ఇంజనీరింగ్ విభాగం చేసే పనులు ఏ ఒక్కరికి దొరికేవి కావు. అంత గుట్టుగా వ్యవహారాలను సాగించేవారు. కానీ ఇటీవల అడ్మినిస్ట్రేటివ్ విభాగంలోకి వచ్చిన కొందరీ అధికారులు, ఇంజనీరింగ్ విభాగంలోని ఉన్నతాధికారులకు మధ్య పొసగకపోవడమే ఈ బాగోతాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. మొదటి నుంచి రేడియల్ రోడ్లపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ముఖ్యంగా పాలన వ్యవహారాలను చక్కబెట్టే ఓ ఉన్నతాధికారి నేరుగా ఆలైన్మెంట్ల విషయంలో జోక్యం చేసుకుంటే… మరో ఇంజనీరింగ్ ఉన్నతాధికారి అయితే టెండర్లను సీఎంవో చెప్పిన కంపెనీలకు కట్టబెట్టడానికి అవసరమైన సాంకేతిక వ్యవహారాలను చూసుకునేవారు. ఇలా ఇప్పటివరకు హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టిన లింకు రోడ్ల నుంచి హెచ్జీసీఎల్ చేపట్టిన రేడియల్ రోడ్ల వ్యవహారాన్ని వాటాల్లో అందిన కాడికి పంచుకున్నారే ఆరోపణలు ఉన్నాయి. రేడియల్ రోడ్లపై వాటాల్లో వచ్చిన తేడాలే ఆ ప్రాజెక్టును మసకబారేలా చేస్తుందనే విమర్శలున్నాయి.ప్రభుత్వ పెద్దలతో కలిసి హెచ్జీసీఎల్ను అక్రమాలకు వేదికగా మార్చివేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

