హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లో (Shamirpet) కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్‌పేటలో ఉన్న సెలబ్రిటీ క్లబ్లో (Celebrity club) ఓ యువకుడిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. క్లబ్‌లోకి ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి వచ్చింది. తన భార్య మరో వ్యక్తితో కలిసి వెళ్లిందని తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో.. వివాహేతర సంబంధంపై (Illegal affair) వారిని నిలదీశాడు.
వారి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో (Air gun) భర్తపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు గాయపడ్డాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. వివాహేతర సంబంధమే కాల్పులకు కారణమని నిర్ధారించారు.