ఏజెంట్లదే రాజ్యం!
నగరంలో కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఇప్పటికీ ఏజెంట్లే చక్రం తిప్పుతున్నారు. ఇటీవల ఏసీబీ సోదాలు జరిగినప్పటికీ వారం రోజులు మౌనంగా ఉన్న ఏజెంట్లు మళ్లీ యాక్టివ్ అయ్యారు. మేడ్చల్, కొండాపూర్, మణికొండ, నాగోల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ కార్యాలయాల్లో ఏజెంట్లు చెబితేనే పనులు పూర్తవుతున్నాయి.
- అధికారుల కొర్రీలు.. ఏజెంట్ల పరిష్కారాలు
- హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ లేని వాహనదారులకు ఆర్టీఏ తిప్పలు
- షోరూంల్లోనూ డేటా లేదని తిప్పి పంపిస్తున్న వైనం
- ఇటువంటి కేసుల్లో ఏజెంట్లను ఆశ్రయిస్తేనే పనులు పూర్తి
- గ్రేటర్లో వేలాది వాహనాలకు లేని హెచ్ఎస్ఆర్పీ
- డబ్బులిచ్చి పనులు పూర్తి చేసుకుంటున్న వైనం
- రవాణా శాఖ అధికారులపై వాహనదారుల ఆగ్రహం
సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : నగరంలో కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఇప్పటికీ ఏజెంట్లే చక్రం తిప్పుతున్నారు. ఇటీవల ఏసీబీ సోదాలు జరిగినప్పటికీ వారం రోజులు మౌనంగా ఉన్న ఏజెంట్లు మళ్లీ యాక్టివ్ అయ్యారు. మేడ్చల్, కొండాపూర్, మణికొండ, నాగోల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ కార్యాలయాల్లో ఏజెంట్లు చెబితేనే పనులు పూర్తవుతున్నాయి. ముఖ్యంగా వాహనదారులు కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఏదో ఒక కొర్రీ పెట్టి అధికారులు సంబంధిత ఫైల్‌ను తిరస్కరిస్తున్నారు. అదే ఫైల్‌ను ఏజెంట్లతో వెళితే అదే రోజు పని పూర్తవుతుందని వాహనదారులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇటీవల ఓ వాహనదారుడు తన వాహనాన్ని వేరొక వ్యక్తికి విక్రయించాలనుకున్నాడు.
అయితే ఆ వా హనానికి హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్ లేదు. దీంతో ముందు ఆ వాహనానికి హెచ్ఎస్ఆర్పీ బిగించాలని అధికారులు చెప్పారు. తాను 2109లో కొనానని.. ఇప్పుడు ఆ షోరూం లేదని వాపోయాడు. బండి కంపెనీ షోరూంకు వెళ్లి ఆరా తీయగా ఆ వాహన నంబర్ వివరాలు తమ డేటాలో లేవని చేతులెత్తేశారు. ఆర్టీఏలోనే డేటా ఉంటుందని సూచించారు. దీంతో ఆ వ్యక్తి ఆర్టీవో కార్యాలయంలో సంప్రదించగా తమ వద్ద నంబర్ ప్లేట్లు ఉండవని, పాతవన్నీ షోరూంలకు పంపించామని చెప్పి పంపారు.
మరి తన సమస్య ఎలా పరిష్కరించుకోవాలో చెప్పండంటూ ఓ ఎంవీఐ అధికారితో వాగ్వాదానికి దిగాడు. ఇక అంతే సంగతులు తామేం చేయలేమంటూ సదరు ఎంవీఐ తేల్చేశాడు. ఇలాంటి క్రమంలో ఓ ఏజెంట్‌ను ఆశ్రయించాడు సదరు వ్యక్తి. దీంతో ఆ వ్యక్తి అడిగినంత డబ్బు చెల్లించాడు. మరుసటి రోజున ఆ వ్యక్తికి సంబంధించిన నంబర్ ప్లేట్ బిగింపు జరిగిపోయింది. దీనికి అధికారులు ఓకే చేసేశారు. ఆ వాహనం మరో వ్యక్తికి బదలాయింపు కూడా జరిగిపోయింది. ఇలాంటి కేసుల్లో రవాణా శాఖ అధికారులు పరిష్కారం చూపి వాహనదారులకు అండగా ఉండాలి కానీ సమస్య మధ్యలో వదిలేసి డబ్బులు ఇచ్చే వరకు, ఏజెంట్లను ఆశ్రయించే వరకు తిప్పుకోవడం సరైనది కాదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేలాది వాహనాలకు నో ప్లేట్లు..
2019 ఏప్రిల్ నుంచి హెసైక్యూరిటీ రిజిస్ట్రేషన్ప్లేట్స్(హెచ్ఎస్ఆర్పీ) బిగింపు రవాణా శాఖ చేపట్టింది. ఆ సమయంలో వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాక సంబంధిత ఆర్టీవో కార్యాలయాల్లోనే నంబర్ ప్లేట్స్ ఇచ్చి బిగించేవాళ్లు. ఆ క్రమంలో వాహనదారులకు మరింత సులభతరంగా అందడం దృష్ట్యా నంబర్ ప్లేట్ల బిగింపు ప్రక్రియ షోరూంలకు అప్పగించారు. షోరూంల్లో నంబర్ ప్లేట్ల జారీకి రెండు నెలలకు పైగా సమ యం పట్టేది. చాలామంది ఆ నంబర్ ప్లేట్లు తీసుకోకుండా వదిలేశారు. సాధారణ నంబర్ ప్లేట్స్‌తో వాహనాలకు బిగించుకుని నడిపిస్తున్నారు.
ఇప్పుడు ఆ వాహనాన్ని మరొకరికి అమ్మాలం టే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉండాల్సిందే. ఈ క్రమంలో చాలా మంది వాహనదారులు తమ పాత నంబర్ ప్లేట్స్ కోసం సంబంధిత ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొందరి వాహనాల వివరాలు షోరూంల్లో నమోదు కాకపోవడంతో తాము నంబర్ ప్లేట్ కేటాయించలేమని చెబుతున్నారు. దీంతో ఆర్టీఏ కార్యాలయాలకు మళ్లీ సంప్రదించాల్సి వస్తుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు సంప్రదించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

