ట్రూ అప్ బాదుడు!
హైదరాబాద్‌కు చెందిన ఒక వినియోగదారుడికి నవంబర్ నెల బిల్లులో ట్రూ అప్ చార్జీల పేరిట రూ. 24 నమోదు చేశారు. 2022-23 సంవత్సరంలో వినియోగించిన యూనిట్ల మొత్తాన్ని 12 నెలలకు సరాసరి తీయగా, వచ్చిన మొత్తాన్ని నెలవారీ విద్యుత్ యూనిట్‌గా లెక్కించి ,యూనిట్‌కు రూ. 0.30 పైసల చొప్పున లెక్కగట్టి బిల్లులో నమోదు చేస్తునారు.
- అద్దెవాసులపై అదనపు భారం
- ఈ నెల నుంచి కరెంట్ బిల్లులో అదనపు చార్జీలు
- 9నెలల పాటు వినియోగదారుల నుంచి వసూళ్లు
సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ)హైదరాబాద్‌కు చెందిన ఒక వినియోగదారుడికి నవంబర్ నెల బిల్లులో ట్రూ అప్ చార్జీల పేరిట రూ. 24 నమోదు చేశారు. 2022-23 సంవత్సరంలో వినియోగించిన యూనిట్ల మొత్తాన్ని 12 నెలలకు సరాసరి తీయగా, వచ్చిన మొత్తాన్ని నెలవారీ విద్యుత్ యూనిట్‌గా లెక్కించి ,యూనిట్‌కు రూ. 0.30 పైసల చొప్పున లెక్కగట్టి బిల్లులో నమోదు చేస్తునారు. ఈ లెక్కన బిల్లులో సదరు వినియోగదారుడికి నెలవారీగా ఉపయోగించిన 81 యూనిట్లకు 30 పైసల చొప్పున రూ.24 ట్రూ అప్ చార్జీల పేరుతో బిల్లులో కలిపి వచ్చింది. ఇదే తరహాలో క్యూర్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ఈ నెల బిల్లులో ట్రూ అప్ చార్జీలు కలిపి వస్తాయి. ఈనెల కరెంటు బిల్లుల్లో అదనపు బాదుడు తప్పదు.. టీజీఎస్పీడీసీఎల్ తన వినియోగదారుల నుంచి ట్రూ అప్ చార్జీలు వసూలు చేయడానికి ఈఆర్సీ అనుమతినిచ్చింది. ఈ మేరకు నవంబర్ నెలలో 100 యూనిట్లకు రూ.30, డిసెంబర్ నెలలో రూ.50 చొప్పున చార్జీలను వసూలు చేస్తారు.
ఎస్పీడీసీఎల్లో ఈ చార్జీలను 29 నెలల పాటు వసూలు చేయడానికి నిర్ణయించారు. దీంతో క్యూర్ పరిధిలో సుమారు 50 లక్షల గృహ విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ భారం పడనున్నది. విద్యుత్ కొనుగోలు మరియు సరఫరా అంచనా కంటే ఎక్కువ ఖర్చు అయినందుకు ఆ లోటును భర్తీ చేయడానికి ఈ ట్రూ అప్ చార్జీలను విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2022-23,2023-24 ఆర్థిక సంవత్సరాలకు కలిపి రూ.7635 కోట్ల ట్రూ అప్‌కు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఇందులో రూ. 2,214.99 కోట్లను వ్యవసాయ వినియోగం ఖాతాలో లెక్క వేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తున్నది. మిగిలిన రూ.5420 కోట్లలో రూ.4,22.93 కోట్లు దక్షిణ డిస్కం వసూలు చేయాలి. ఈమేరకు తన వినియోగదారుల నుంచి 29 నెలల పాటు దక్షిణ డిస్కం ట్రూ అప్ చార్జీలు వసూలు చేస్తున్నది. 2016-22 మధ్య కాలంలో ట్రూ అప్ చార్జీల కింద రూ.12,514.57 కోట్లు వసూలు చేసేందుకు ఈఆర్సీ అనుమతిచ్చింది. కానీ ఈ భారాన్ని కేసీఆర్ సర్కార్ ప్రజలపై వేయలేదు. విద్యుత్ సంస్థల భారాన్ని ప్రజలపై వేయవద్దంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వినియోగదారులపై నేరుగా భారాన్ని వేయకుండా ఐదేండ్లలో ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేసింది. ఇందులో రూ.10వేల కోట్లు ట్రూ అప్ కాగా, రూ.2వేల కోట్లు ఉదయ్ సేవింగ్స్ రివర్సల్ కింద ప్రభుత్వమే చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రజలకు ట్రూ అప్ చార్జీల నుంచి ఉపశమనం కలిగించారు.

ట్రూ అప్చార్జీలు ఇలా!
హైదరాబాద్‌లో 52 లక్షలకు పైగా గృహ కనెక్షన్లు ఉన్నాయి. యూనిట్‌కు 30పైసల చార్జీ వల్ల వంద యూనిట్లు వినియోగించే వారిపై రూ.30 చొప్పున నవంబరు నెలలో వారు వాడిన బిల్లుకు 81యూనిట్లకు అదనంగా రూ.24లు, డిసెంబర్ నుంచి 50పైసల చొప్పున రూ.40 అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. 29 నెలల వసూళ్లలో భాగంగా ఈ నవంబరు నెల నుంచే కరెంటు బిల్లులో ట్రూ అప్ చార్జీలు కనిపిస్తున్నాయి. ఇది వినియోగదారులపై అదనపు భారంగా విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. వీటిని సాధారణ బిల్లులో కలపకుండా ప్రత్యేకంగా చూపుతున్నారు. ఆ ఏడాదిలో వినియోగించిన విద్యుత్ యూనిట్లను సరాసరి లెక్కించి, యూనిట్లతో పాటు 30పైసల చొప్పున లెక్కించి చూపుతున్నారు. ప్రస్తుతం స్లాబ్‌లను బట్టి యూనిట్ ధర ఉంది. స్లాబ్‌లతో సంబంధం లేకుండా వినియోగదారులు ఉపయోగించే యూనిట్ల మొత్తంపై యూనిట్ చొప్పున వసూలు చేస్తున్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే వారికి కరెంటు బిల్లులు వేయడం లేదు. వారికి జీరో బిల్లులు ఇస్తుండడంతో ట్రూ అప్ చార్జీలు వేసినా అవి కూడా అందులోనే కలుస్తున్నాయని తెలుస్తోంది. 2022-23లో ఈ పథకం లేకపోయినా ఆ ఏడాదిలో వినియోగించిన విద్యుత్ యూనిట్లను బిల్లులో చూపినా ప్రస్తుత నెలలో 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న వారికి మైనస్‌లోనే బిల్లు వస్తోంది.
గ్రేటర్లో అద్దెవాసులపై భారం!
క్యూర్ పరిధిలో దాదాపు 70.63 శాతం కుటుంబాలు అద్దె ఇండ్లలోనే నివసిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 35.91 లక్షల నివాస యూనిట్లు ఉండగా అందులో అత్యధిక శాతం మంది అద్దెదారులే కావడం గమనార్హం. అద్దెవాసులు శాశ్వతంగా ఒకే ఇంట్లో ఉండరు. తమ అవసరాలను బట్టి, స్థానిక పరిస్థితులు, ఇంటి యజమానులతో ఉన్న సంబంధాలను బట్టి ఇండ్లు మారుతూ ఉంటారు. ఈ క్రమంలో నాలుగేండ్ల కిందట హైదరాబాద్‌లో నివాసమున్న చోటు నుంచి మరొక చోటికి మారే అవకాశాలే ఎక్కువ కాగా తాము నివసించని ప్రాంతంలో గతంలో నివసించిన వారు వాడుకున్న కరెంటు బిల్లుకు సంబంధించి ట్రూ అప్ చార్జీలు వస్తున్నాయి. దీంతో ట్రూఅప్ చార్జీల వ్యవహారంతో అద్దె ఇండ్లలో ఉండేవారికి కొత్త సమస్యలు వస్తున్నాయి. ఆ రెండు ఆర్థిక సంవత్సరాల్లో అద్దె ఇంట్లో ఉన్న వారు మారిపోయి ఉంటారు. గతంలో కిరాయికి ఉన్నవారు వాడిన కరెంటుకు ఇప్పుడు అద్దెకు ఉంటున్న వారు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అద్దెకున్న వారు తామెందుకు పాత బిల్లు కడతామంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంలో డిస్కంలు మాత్రం తమకు విద్యుత్ కనెక్షన్లతోనే సంబంధమని, అక్కడ ఎవరున్నారనేది తాము చూడమంటూ సమాధానమిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం గ్రేటర్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

