చీరకట్టు కాపాడుకుందాం..
‘ప్రపంచ వస్త్రధారణలో చీర స్థానం ఎప్పటికీ పై మెట్టే.. ప్రపంచానికి చీర అందం పరిచయం చేసిన ఘనతమన దేశానిదే.. అలాంటి చీరకట్టు నేడు అంతరించి పోతున్నది.
- చేనేతను ప్రమోట్ చేద్దాం..
- ఈవెంట్స్‌లో చీరను ధరించి పాల్గొంటున్న మహిళ
- ఈ తరానికి చీరపై అవగాహన కల్పించడమే సుధ లక్ష్యం
సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ) ; ‘ప్రపంచ వస్త్రధారణలో చీర స్థానం ఎప్పటికీ పై మెట్టే.. ప్రపంచానికి చీర అందం పరిచయం చేసిన ఘనతమన దేశానిదే.. అలాంటి చీరకట్టు నేడు అంతరించి పోతున్నది. పాశ్చాత్య సంస్కృతి మోజులో నేడు మన చీరకట్టు వెలవెలబోతున్నది. అందుకే ఆ చీరకట్టు ప్రాధాన్యతపై అవగాహన కల్పించి.. మన సంస్కృతిని కాపాడటానికి నా వంతుగా బాధ్యత నిర్వర్తిస్తున్నా. రన్నింగ్, సైక్లింగ్, వాకింగ్‌లకు సంబంధించిన ఎలాంటి ఈవెంట్లోనైనా చీరకట్టులోనే పాల్గొనడం ఆనవాయితీగా పెట్టుకున్నా.’ అని అల్వాల్‌కు చెందిన సుధ చెప్పారు. చీరకట్టు గొప్పదానన్ని ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. అవేమిటో ఆమె మాట్లలోనే.. –
ఈవెంట్ ఏదైనా చీరలోనే..
ప్రతి వీకెండ్లో నా వంతుగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాను. నగరంలో సామాజిక కార్యక్రమం ఎక్కడ జరిగినా వలంటీర్‌గా పాల్గొనడం నాకు చాలా ఇష్టం. అయితే నా ప్రధాన లక్ష్యం చీర గొప్పతనం చాటడం. చేనేతను ప్రోత్సహించడం. అందుకే రన్నిం గ్, సైక్లింగ్, వాకింగ్ కార్యక్రమాల్లో చీరకట్టులోనే పాల్గొంటాను. పీపుల్స్ ప్లాజా 10కే రన్, నెక్లెస్‌రోడ్ వైటథాన్, టాటా ముంబై మారథాన్, విజయవాడ మారథాన్లు పూర్తి చేశాను. చాలా మంది వైటథాన్, మారథాన్, సైక్లింగ్ ఈవెంట్స్‌ల్లో నేను చీరకట్టులో పాల్గొనడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసేవారు. చీరలో ఎందుకు రావడం.. సదరు కార్యక్రమాలకు అనుకూలమైన దుస్తులు ధరించడం బెటర్ అంటూ చెప్పేవారు. అయితే నా ఉద్దేశం వారికి తెలియదు. ప్రతి కార్యక్రమంలో అంతరించిపోతున్న చీర ప్రాధాన్యతను చాటాలని ప్రయత్నిస్తుంటా.
గిన్నీస్ రికార్డు చరిత్ర ఉంది
మన చీరలకు గిన్నీస్ రికార్డు చరిత్ర ఉంది. నేను ప్రతి సోమవారం చేనేత దుస్తులను ధరిస్తాను. చేనేత చీరలకు ప్రసిద్ధి సిరిసిల్ల. చేనేత నిపుణుడు నల్లా పరంధాములు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి.. 1990లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అటువంటి చేనేతను కాపాడిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. నేత దుస్తులు ధరించడమనేది ఒక ఉద్యమంలా తీసుకొచ్చింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

