హైదరాబాద్ : సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ హంగామా సృష్టించింది. నో పార్కింగ్ స్థలంలో మహిళ తన కారును నిలిపివేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ కారుకు చలాన్ విధించారు. కారుకు చలాన్ విధించడాన్ని మహిళ తప్పుబట్టింది. తన కారుకు ఎలా చలాన్ విధిస్తారని ప్రశ్నించింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉన్న వాకీ టాకీని లాక్కొని హంగామా సృష్టించింది.