ప్రేమ పేరుతో నమ్మించాడు.. పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడు..
Lovers | ప్రేమ పేరుతో యువతిని నమ్మించాడు.. పెళ్లి చేసుకుంటానని లోబర్చుకున్నాడు.. పెళ్లి అనే పదం లేవనెత్తెసరికి ముఖం చాటేస్తున్నాడు. దీంతో బాధిత యువతి తన ప్రియుడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బంజారాహిల్స్ : ప్రేమ పేరుతో యువతిని నమ్మించాడు.. పెళ్లి చేసుకుంటానని లోబర్చుకున్నాడు.. పెళ్లి అనే పదం లేవనెత్తెసరికి ముఖం చాటేస్తున్నాడు. దీంతో బాధిత యువతి తన ప్రియుడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 11లోని సింగాడకుంటలో నివాసం ఉంటున్న సీహెచ్ గౌతమ్(28) ఐబీఎం సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి(27) ఓ నిర్మాణసంస్థలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తుంది. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఏడేండ్ల నుంచి ఆ యువతిని ప్రేమిస్తున్న గౌతమ్.. ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.
దీంతో వీరిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుందాం అనేసరికి పలు కారణాలు చెప్పి వాయిదా వేస్తున్నాడు. ఇటీవలే గౌతమ్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి ప్రియురాలికి కనిపించకుండా ముఖం చాటేశాడు. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

