హైదరాబాద్ : జూబ్లీహిల్స్లో ఓ యువతిని పోకిరీలు వేధించారు. క్లబ్ రోగ్ పబ్ నుంచి బయటకు వచ్చిన యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. పబ్ వద్ద తన కారు కోసం ఎదురుచూస్తున్న యువతిని వేధింపులకు గురి చేశారు. కారు ఎక్కాలని యువతిని పోకిరీలు బలవంతం పెట్టారు. కారు ఎక్కేందుకు నిరాకరించిన ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు. తన కారులో వెళ్తున్న యువతిని యువకులు వెంబడించి భయాందోళనలకు గురి చేశారు. యువకులపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో బాధిత యువతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.