ఆర్టీసీ బస్ ఢీకొని ఒకరి మృతి
ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. మరోవ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోను, వికాస్ నగరంలో ఉంటూ.. దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.
కార్వాన్, జూన్ 25: ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. మరోవ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోను, వికాస్ నగరంలో ఉంటూ.. దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం శంకర్‌పల్లిలో పనులు ముగించుకొని మొఘల్ కా నాలా నుంచి కార్వాన్ వైపు తమ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అయితే, రాంసింగ్‌పుర రోడ్డు వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్ వీరిని తగులుతూ వేగంగా కుడి వైపు మళ్లింది. దీంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో సోను, వికాస్ కింద పడిపోయారు. ఆర్టీసీ బస్ వెనుక టైర్ సోను తల పైనుంచి వెళ్లడంతో అతడి మెదడు రోడ్డుపై పడింది. వెనుక కూర్చున్న వికాస్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ మాత్రం బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న కుల్సుంపుర ఏసీపీ మునావర్, టప్పాచబుత్రా ఇన్స్పెక్టర్ రాములు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్.ఐ. అబ్దుల్ ఆథిల్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- One Died
- RTC Bus
- RTC Bus Deh
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

