రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు చేసి.. రూ.2.20 కోట్లు కొట్టేశారు సైబర్ నేరస్తులు. నాంపల్లికి చెందిన 72 ఏండ్ల వృద్ధురాలికి ఓ వ్యక్తి వీడియోకాల్ చేసి.. సీబీఐ అధికారినని చెప్పుకొన్నాడు. బాధితురాలి పేరుతో అక్రమ మాదకద్రవ్యాలు ఉన్న పార్సిల్ బుక్ అయిందని, ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతా మనీలాండరింగ్‌లో ఉపయోగించబడిందని చెప్పాడు.
సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు చేసి.. రూ.2.20 కోట్లు కొట్టేశారు సైబర్ నేరస్తులు. నాంపల్లికి చెందిన 72 ఏండ్ల వృద్ధురాలికి ఓ వ్యక్తి వీడియోకాల్ చేసి.. సీబీఐ అధికారినని చెప్పుకొన్నాడు. బాధితురాలి పేరుతో అక్రమ మాదకద్రవ్యాలు ఉన్న పార్సిల్ బుక్ అయిందని, ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతా మనీలాండరింగ్‌లో ఉపయోగించబడిందని చెప్పాడు.
నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి ఆమెను అరెస్టు చేస్తామని బెదిరించాడు. భద్రతా డిపాజిట్ల పేరుతో, వివిధ వ్యక్తుల నియంత్రణలో ఉన్న బ్యాంకు ఖాతాలకు అనేకసార్లు డబ్బు బదిలీ చేయాలని సైబర్ నేరస్తులు బలవంతపెట్టారు. దీంతో ఆమె వారు చెప్పిన ఖాతాలకు నగదు బదిలీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

