Shamshabad Airport : హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజాయిని గుట్టుగా తరలిస్టున్న వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన వ్యక్తి బ్యాగును తనిఖీలు చేయగా.. అందులో 13.2 కిలోల గంజాయి బయల్పడింది.
పట్టుబడిన హైడ్రోఫోనిక్ గంజాయి మార్కెట్ విలువు రూ.4.6 కోట్లు ఉంటుందని సమచారం. గంజాయిని తరలిస్తున్న అతడితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.