ఎంఎన్జేలో మరో 300 పడకలు
విధ రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు అండగా నిలుస్తున్న ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన కార్పొరేట్‌ను తలదన్నేలా కొత్తరూపు దిద్దుకుంటున్నది. రూ.100కోట్లతో నిర్మిస్తున్న దవాఖాన కొత్త బ్లాక్‌లలో మెడికల్ ఆంకాలజీ బ్లాక్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది
మూడు కొత్త విభాగాలతో మరింత ఆధునీకరణ
కార్పొరేట్ హంగులు అద్దుకుంటున్న క్యాన్సర్ దవాఖాన
నెల రోజుల్లో ప్రారంభం కానున్న మెడికల్ ఆంకాలజీ,
పిడియాట్రిక్, బోన్ మ్యారో సేవలు
సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు అండగా నిలుస్తున్న ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన కార్పొరేట్‌ను తలదన్నేలా కొత్తరూపు దిద్దుకుంటున్నది. రూ.100కోట్లతో నిర్మిస్తున్న దవాఖాన కొత్త బ్లాక్‌లలో మెడికల్ ఆంకాలజీ బ్లాక్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. 300 పడకల సామర్థ్యంతో మూడు అత్యాధునిక విభాగాలు అందుబాటులోకి రానున్నట్లు ఎంఎన్‌జే డైరెక్టర్ డాక్టర్ జయలత వెల్లడించారు. స్వరాష్ర్టానికి ముందు కేవలం 250 పడకలతో నిత్యం 600 మంది ఇన్ పేషెంట్లు, వెయ్యి మంది ఔట్ పేషెంట్లకు సేవలందించిన ఎంఎన్‌జే సామర్థ్యాన్ని తెలంగాణ సర్కార్ 450కు పెంచిన విషయం తెలిసిందే. అయితే, రోజురోజుకూ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరగడం, క్యాన్సర్ చికిత్స ఖరీదైనది కావడంతో నిరుపేద రోగులకు ఆర్థిక భారం తప్పడం లేదు. దీనిని గమనించిన తెలంగాణ సర్కార్ ఎంఎన్‌జేను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి పరిచేందుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో దవాఖాన పక్కన ఉన్న మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలోని మూడున్నర ఎకరాల స్థలంలో ఐదు కొత్త బ్లాకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలో రెండేండ్ల కిందట ప్రారంభించిన నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. 300 పడకల సామర్థ్యం గల మెడికల్ ఆంకాలజీ బ్లాక్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో ఈ బ్లాక్‌ను ప్రారంభించనున్నట్లు ఎంఎన్‌జే డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు. ఈ బ్లాక్ అందుబాటులోకి వస్తే రోగులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. ప్రస్తుతం రోజూ 500 నుంచి 1000 మంది వరకు ఓపీ రోగులు వస్తున్నారు. ప్రతి నిత్యం 600 వరకు ఐపీ రోగులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు స్త్రీ, పురుషులకు ఒకే దగ్గర ఓపీ ఉంది. కొత్త బ్లాక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఓసీ సేవలందించనున్నట్లు అధికారులు వివరించారు.
300 పడకలతో ఐపీ సేవలు
కొత్తగా అందుబాటులోకి రానున్న బ్లాక్ ద్వారా 100 పడకలతో మేల్ వార్డు, 100 పడకలతో ఫిమేల్ వార్డు, 100 పడకలను చిన్న పిల్లలకు కేటాయించారు. దీంతో, దవాఖాన పడకల సంఖ్య 750కు పెరగనుంది. పడకల సంఖ్య పెరగడంతో ఐపీ రోగులకు అడ్మిషన్ కోసం నిరీక్షణ తప్పనుంది.
కొత్తగా అందుబాటులోకి రానున్న విభాగాలు
మెడికల్
ఆంకాలజీ విభాగం
చిన్నపిల్లల విభాగం
బోన్‌మ్యారో విభాగం

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

