Power Cuts | గ్రేటర్లో రోజూ 2 గంటలు కరెంటు కట్.. గందరగోళంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ
శీతాకాలంలోనే విద్యుత్ మరమ్మతుల పేరిట అధికారికంగా రోజూ 2 గంటలు విధిస్తున్న కరెంటు కోతలపై నగర వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వేసవిలో నిరంతరం నాణ్యమైన కరెంటు సరఫరా కోసం అంటూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ విడుదల చేసిన మరమ్మతుల ప్రణాళికపై మండిపడుతున్నారు.
- మరమ్మతుల పేరిట విద్యుత్ నిలుపుదల
- జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 వరకు షెడ్యూలు విడుదల
- శీతాకాలం కోతలపై సోషల్ మీడియాలో ఫిర్యాదు వెల్లువ
Power Cuts | సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : శీతాకాలంలోనే విద్యుత్ మరమ్మతుల పేరిట అధికారికంగా రోజూ 2 గంటలు విధిస్తున్న కరెంటు కోతలపై నగర వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వేసవిలో నిరంతరం నాణ్యమైన కరెంటు సరఫరా కోసం అంటూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ విడుదల చేసిన మరమ్మతుల ప్రణాళికపై మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ మరమ్మతులు చేపట్టినా ఇలాంటి పరిస్థితి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు కోతలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల కిత్రం జనవరి 17నుంచి ఫిబ్రవరి 10 వరకు గ్రేటర్‌లోని 9 సర్కిళ్ల పరిధిలో 2 గంటలు కరెంటు కోతలు ఉంటాయనడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయింది. బుధవారం కరెంటు కోతలపై సోషల్ మీడియాలో పలువురు వినియోగదారులు పోస్టు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారప్ అలీ ఫరూఖీకి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తూనే ఉన్నారు. మరమ్మతుల షెడ్యూలు ప్రకటించిన ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా అంతరాయం ఉన్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు.
నేడు 125 ఫీడర్స్ పరిధిలో..
గురువారం మొత్తం 125 ఫీడర్ల పరిధిలో మరమ్మతులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందులో బంజారాహిల్స్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, సికింద్రాబాద్, మేడ్చల్, హబ్సీగూడ, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ సర్కిళ్లలో 11 కేవీ ఫీడర్లు మొత్తం 2352 ఉన్నాయి. అందులో 125 ఫీడర్ల పరిధిలోనే విద్యుత్ లైన్ల మరమ్మతుల వల్ల కనిష్ఠంగా 30 నిమిషాల నుంచి గరిష్ఠంగా 2 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తామని అధికారులు తెలిపారు.
ట్వీట్లలో మచ్చుకు కొన్ని..
- శంకర్‌మఠ్ పవర్ స్టేషన్ పరిధిలో 2గంటల కంటే ఎక్కువ సమయం విద్యుత్ కోత ఏర్పడింది. ప్రతి 30 నిమిషాల తర్వాత పవర్ కట్ సమస్య ఉంది. ప్యూజ్ ఆఫ్ కాల్ నంబర్ (9490619768)కు ఫోన్ చేస్తే ఎటువంటి ప్రతిస్పందన లేదు. దయచేసి త్వరగా పునరుద్ధరించండి.’ అంటూ జీషాన్ అహ్మద్ ట్వీట్ చేశారు.
- 3గంటలకు పైగా కరెంటు కోత ఉంది. ఏం జరుగుతోంది? కరెంటు కోతలు ఎందుకు వస్తున్నాయి? అంటూ సయ్యద్ సలార్ ట్వీట్ చేశారు.
- భారతి నిలయం వద్ద 2 గంటలకు పైగా కరెంటు లేదు. ఏదైనా సమస్య ఉందా? 1-9-202/ఇ/1/డి/1 రాంనగర్, పార్సిగుట్టలో ఉంటాను. దయచేసి అప్డేట్ చేయండి’ అంటూ మాచర్ల శివానీ ట్వీట్ చేశారు.
- మా ఏరియాలో కరెంటు కోత పెట్టి 2.5 గంటలైంది. మెయిన్టెనెన్స్ కారణంగా పవర్ కట్ అవుతుందని నాకు తెలుసు, కానీ అధికారులు రోజు మొత్తం మెయింటెనెన్స్ చేయాలనుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది? అని సతీశ్ కుమార్ ట్వీట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

