18 నెలల బాలుడికి ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ విజయవంతం
హైదరాబాద్ : ఆడుకుంటూ రెండో అంతస్తు నుంచి కిందపడి కోమాలోకి వెళ్లిన బాలుడికి.. ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ నిర్వహించి ప్రాణాలను కాపాడారు. బాలుడిని ప్రాణాలతో కాపాడిన రెనోవో హాస్పిటల్ వైద్యులకు అతడి తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నగరానికి చెందిన ఓ 18 నెలల పిల్లాడు ఆడుకుంటూ రెండో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. దీంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. తక్షణమే ఆ బాబు తల్లిదండ్రులు సనత్‌నగర్‌లోని రెనోవో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. చికిత్స ప్రారంభించారు. పలు పరీక్షల అనంతరం.. సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ నవీన్ రెడ్డి, నియోనాటాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాశ్ హెడ్డా నేతృత్వంలో బాలుడికి ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. వెంటిలేటర్‌పై ఉంచి శస్త్ర చికిత్స చేశారు.
ఫిజియోథెరపిస్టును కూడా నియమించి, బాలుడిని నిరంతరం పరిశీలనలో ఉంచి చికిత్స చేశారు. దీంతో బాలుడు త్వరగా కోలుకున్నాడు. బాబు శరీర అవయవాలు బాగా పని చేస్తున్నాయని ఫిజియోథెరపిస్టు డాక్టర్ శృతి తెలిపారు. బాలుడు ప్రాణాలతో బయటపడటంతో.. అతని తల్లిదండ్రులు వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

