రూ.30 లక్షల విలువజేసే..150 కిలోల గంజాయి స్వాధీనం
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- నలుగురిని అరెస్టు చేసిన దుండిగల్ పోలీసులు
ండిగల్, జనవరి 24: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువజేసే 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు రెండు వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న దుండిగల్, శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా సోమవారం దుండిగల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ -5, సర్వీసు రోడ్డులో మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని రోటరీ-1 సమీపంలో నిఘాపెట్టారు. అటుగా వచ్చిన మారుతీ ఎస్ఎక్స్-4 వాహనాన్ని ఆపి అందులో ప్రయాణిస్తున్న లూనావత్ నగేశ్(30), నునావత్ వెంకటేశ్(24)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వెనుక వస్తున్న హోండా సిటీ కారులో గంజాయిని తరలిస్తున్నామని, తాము ఎస్కార్ట్‌గా ముందు వెళ్తున్నామంటూ వారు చెప్పారు. పది నిముషాల వ్యవధిలో వచ్చిన హోండా సిటీ కారును ఆపి తనిఖీలు చేపట్టి.. రూ.30 లక్షల విలువజేసే 150 కిలోల గంజాయి (పౌడర్) స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులైన బనోత్ చందర్ (32), గండు అజయ్(21)ని ప్రశ్నించగా.. మహారాష్ట్రలోని తుల్జాపూర్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి గంజాయితోపాటు రెండు కార్లు, మొబైల్ ఫోన్లు, రూ.9వేల నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో నూనావత్ వెంకటేశ్ డిగ్రీ చదువుతున్నాడు. బానోత్ చందర్, లూనావత్ నగేశ్, గండు అజయ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. బానోత్ చందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి కాగా, మిగతా ముగ్గురు సూర్యాపేట జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

