వివాదాస్పదమైన భూమి విక్రయం

సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కొనసాగుతున్న స్థలాన్ని… ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టి రూ.7 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్‌చేసి మంగళవారం సీసీఎస్ పోలీసులు కోర్టు లో హాజరుపరిచారు. బంజారాహిల్స్ రోడ్డు నం. 12లో ఉన్న 9 ఎకరాల 17 గుంటల భూమికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన తిరుమల రాంచందర్ రో, దర్పల్లి సంపత్, మరో వ్యక్తి కలిసి జూబ్లీహిల్స్‌కు చెందిన మిహిరా బిల్డ్‌కాన్ మేనేజింగ్ పార్టనర్ అయిన చాడ సుఖేశ్రెడ్డికి విక్రయించేందుకు ప్రయత్నించి, అడ్వాన్స్‌గా రూ. 7 కోట్లు తీసుకొని మోసం చేసిన విషయం తెలిసిందే. ఈ స్థలం విషయంలో ప్రభుత్వానికి, ప్రైవేటుకు మధ్య వివాదం జరుగుతుంది. దీంతో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను నిందితులు సృష్టించారు.
అయితే రెవెన్యూ రికార్డుల్లో జితిన్ రాజ్ జైన్, యూనిటెక్ టియల్ ఎస్టేట్ బిల్డర్స్‌కు యాజమాన్య హక్కులు లభించే విధంగా రికార్డులను మార్పించి, ఈ స్థలానికి సంబంధించిన ఎన్ఓసీని కూడా తీసుకువస్తామని నిందితులు.. కొనుగోలుకు ముందుకు వచ్చిన మిహిరా బిల్డ్‌కాన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. నిందితులు చెప్పిన విషయాలు, ఆ స్థలానికి సంబంధించిన పూర్వ పరాలను పరిశీలించడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీఎస్ ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపారు. నిందితులు పక్కా ప్లాన్‌తో బాధితుడిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలడంతో నిందితులు తిరుమల రాంచందర్ రో, దర్పల్లి సంపత్, తిరుమల అవినాష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని సీసీఎస్ జాయింట్ సీపీ అవినాస్ మహంతి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- arrested
- Disputed land
- sales
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

