మేషం
ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తి ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
వృషభం
వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా కొనసాగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూల సమయం. పోటీ పరీక్షలలో సానుకూల ఫలితాలు సాధిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. వాహనం, భూమి కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్థులకు స్థానచలన సూచన. కర్షకులకు, కార్మికులకు అనుకూల వారం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేపీ పెరుగుతుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి.
మిథునం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో పై అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి. వ్యాపారులు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది. గురు ప్రభావంతో అన్ని పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి.
విద్యార్థులకు అనుకూలం.
కర్కాటకం
దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలసట లేకుండా పనులపై మనసు నిలుపుతారు. ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వాహనం వల్ల ఖర్చులు అధికం అవుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండాలి. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అయితే, కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఇచ్చిన డబ్బు చేతికి అందడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు.
సింహం
బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంది. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది.
కన్య
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూల వారం. మంచి సంస్థలలో చేరతారు. స్నేహితులు, బంధు
మిత్రులతో పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకురావచ్చు. వ్యాపార విస్తరణ వాయిదా పడవచ్చు. కొత్త పరిచయాలతో పనులు కలిసి వస్తాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. సహోద్యోగులతో స్నేహం కుదురుతుంది. అదే సమయంలో పై అధికారులతో మనస్పర్ధలు రావచ్చు. ఉద్యోగంలో స్థానచలన సూచన ఉంది. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దవారి సలహాలు స్వీకరిస్తారు. వాటిని అమలుపరిచి సత్ఫలితాలు సాధిస్తారు. గురుభక్తి పెరుగుతుంది.
తుల
ఇంటా బయటా అనుకూల వాతావరణం. గురు మార్పు లాభదాయకం. రావలసిన డబ్బు ఆలస్యంగా అందినప్పటికీ అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు కొంతవరకు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు. ప్రభుత్వ పనులలో కాలయాపన జరగవచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనసు నిలపండి.
వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో విందులూ వినోదాల్లో పాల్గొంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. శుభకార్య ప్రయత్నాలలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంత వరకు ఫలిస్తాయి.
ధనుస్సు
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గురు గ్రహ ప్రభావం కొంత ప్రతికూలంగా ఉంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఫలితంగా అనుకున్న పనుల్లో జాప్యం జరగవచ్చు. వాహనం మూలంగా కలిసి వస్తుంది. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా కలిసివస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. అధికారుల విమర్శలు మనసును కష్టపెడతాయి. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టి కష్టపడి పని చేయండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కావలసిన వస్తువులను కొంటారు. దైవభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం
ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు, సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరిగినా.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. గతంలో కన్నా ఈ వారం బాగుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా, ఆఖరి నిమిషంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.
కుంభం
ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు వాయిదా వేస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. రాజకీయంగా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటాయి. పనులలో శ్రమ అధికం. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. అనవసరమైన ఖర్చులు ఎదురైనా, ఆదాయం స్థిరంగా ఉండటంతో ఇబ్బంది ఉండదు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు.
మీనం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన వివాదాల్లో తల దూర్చకండి. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతోఅభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అలసట లేకుండా పట్టుదలతో పనులు చేస్తారు. సంయమనం పాటించండి. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టి, కార్య నిర్వహణపై మనసు నిలపండి. కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in