Numerology | అత్తాకోడళ్లు ఈ తేదీల్లో పుట్టారా.. ఆ ఇంట్లో ప్రతిరోజూ రచ్చ రచ్చే!
Numerology | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా ఆ గ్రహాల ప్రభావం ఉన్న మూలాంకాలకు చెందిన వ్యక్తులు ఒకే ఇంట్లో అత్తాకోడళ్లుగా ఉంటే వారికి కూడా పడదని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Numerology | సాధారణంగా చాలామంది అత్తాకోడళ్లకు అస్సలు పడదు. ఇంట్లో ఏ పనిచేసినా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తుంటాయి.. ప్రతిదానికి గొడవపడుతూ ఉంటారు.. అయితే ఇలా జరిగే గొడవలకు న్యూమరాలజీకి సంబంధం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అత్తాకోడళ్లు ఇలా ఉప్పూనిప్పులా ఉండటానికి కేవలం వారి స్వభావ భేదాలే కాకుండా, పుట్టిన తేదీల ఆధారంగా వచ్చే మూలంకాలు కూడా కారణం కావచ్చని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా ఆ గ్రహాల ప్రభావం ఉన్న మూలాంకాలకు చెందిన వ్యక్తులు ఒకే ఇంట్లో అత్తాకోడళ్లుగా ఉంటే వారికి కూడా పడదని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మూలాంకం 1-8, 3-6, 4-9 కలయిక ఉంటే ఈ అభిప్రాయ భేదాలు మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు.
1-8 మూలాంకాలతో ఆధిపత్య పోరు
సంఖ్యా శాస్త్రం ప్రకారం 1, 10, 19, 28వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 1గా పరిగణిస్తారు. దీనికి అధిపతి సూర్యుడు. అలాగే 8, 17, 26వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8గా భావిస్తారు. దీనిపై శని ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు, శని పరస్పర విరుద్ధ స్వభావం కలిగిన గ్రహాలుగా పేర్కొంటారు. ఈ రెండు మూలాంకాలకు చెందినవారు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటతో తమ మాటకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. దీంతో అత్తాకోడళ్లుగా ఈ మూలాంకాలు కలిస్తే అధికార భావం, అహం, పట్టుదల కారణంగా అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు.
3-6 మూలాంకాలు.. ఆలోచనలు అస్సలు కలవవు
అలాగే 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 3గా పరిగణిస్తారు. 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6గా పరిగణిస్తారు. మూలాంకం 3పై గురుగ్రహం (బృహస్పతి), మూలాంకం 6పై శనిగ్రహ ప్రభావం ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ఈ రెండు గ్రహాలు సహజ శత్రువులుగా పరిగణించబడతాయి. మూలాంకం 3 ఉన్న వారు క్రమశిక్షణ, విలువలు, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. మూలాంకం 6 ఉన్న వారు సౌకర్యాలు, అందం, ఆధునిక జీవనశైలిపై ఆసక్తి చూపుతారని నమ్ముతారు. ఈ భిన్న ఆలోచనా విధానాలు ఉన్న వారు అత్తాకోడళ్లుగా ఉంటే తరచూ గొడవలు జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
4-9 మూలాంకాలు.. తగాదాలకే ఎక్కువ ఛాన్స్
ఇక 4, 13, 22, 31వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 4గా పరిగణిస్తారు. 9, 18, 27వ తేదీల్లో జన్మించినవారి మూలాంకం 9గా పరిగణిస్తారు. మూలాంకం 4పై రాహు ప్రభావం, మూలాంకం 9పై కుజుడి ప్రభావం ఉంటుందని అంటారు. రాహు భిన్న ఆలోచనలు, ఆకస్మిక నిర్ణయాలకు సంకేతంగా భావిస్తే.. కుజుడు ఉత్సాహం, కోపం, దూకుడుకు ప్రతీకగా పేర్కొంటారు. ఈ రెండు మూలాంకాలకు చెందని వారి ఆలోచనా విధానం, స్పందించే తీరు భిన్నంగా ఉండటం వల్ల చిన్న విషయాలకే విభేదాలు పెరిగే అవకాశం ఉంటుందని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

