Horoscope | 26-05-2024 ఆదివారం.. మీ రాశి ఫలాలు
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
వృషభం
ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది.
మిథునం
చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. వ్యవసాయరంగంలోనివారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి.
కర్కాటకం
ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.
సింహం
సంతోషంగా కాలం గడుపుతారు. శుభార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
కన్య
వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
తుల
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
వృశ్చికం
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
ధనుస్సు
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి.
మకరం
కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
కుంభం
అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు.
మీనం
అకాల భోజనాదులవల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభిచకూడదు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

