13-06-2022 సోమవారం.. మీ రాశి ఫలాలు
Horoscope | ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు.
మేషం
ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు.
వృషభం
ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.
మిథునం
ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించక తప్పదు.
కర్కాటకం
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.
సింహం
నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.
కన్య
స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభత్రకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు.
తుల
ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
వృశ్చికం
అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు.
ధనుస్సు
కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
మకరం
నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
కుంభం
తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
మీనం
ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

