మేషం : విందు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురగును. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వృషభం : వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుత్సాహం పనికిరాదు.
మిథునం : ఆకస్మిక ధనలాభముంటుంది. రాజకీయరంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.
కర్కాటకం : మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడుతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషరణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండడం మంచిది.
సింహం : కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కన్య : ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
తుల : మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగోయం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
వృశ్చికం : ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకెళ్తారు.
ధనస్సు : కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకకు ఆటంకాలెదురవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడుపనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
మకరం : కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యం ఇస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.
కుంభం : స్త్రీలమూలకంగా లాభాలుంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌక్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.
మీనం : రుణప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.