అయితే.. ఆస్తమా కావచ్చు!
ప్రపంచ వ్యాప్తంగా పెద్దలతోపాటు పిల్లలనూ వేధిస్తున్న ఊపిరితిత్తుల వ్యాధి ఆస్తమా. చిన్నారులలో ఈ సమస్య మరింత పెరుగుతున్నది. ముఖ్యంగా, ట్రాకియో బ్రాంకియల్ భాగాలపై ఈ వ్యాధి దాడి చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా పెద్దలతోపాటు పిల్లలనూ వేధిస్తున్న ఊపిరితిత్తుల వ్యాధి ఆస్తమా. చిన్నారులలో ఈ సమస్య మరింత పెరుగుతున్నది. ముఖ్యంగా, ట్రాకియో బ్రాంకియల్ భాగాలపై ఈ వ్యాధి దాడి చేస్తుంది. రుగ్మత చుట్టుముట్టినప్పుడు శ్వాసనాళాలు రకరకాల ఉత్ప్రేరకాల వల్ల ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా వాటి పరిమాణం తగ్గిపోతుంది. శ్వాస పీల్చడం, బయటికి వదలడం కష్టం అవుతుంది. ఈ సమస్య స్థిరంగా ఉండక
పోవచ్చు. హఠాత్తుగా దాడిచేసి ఇబ్బందిపెడుతుంది. అంతలోనే కనుమరుగైనట్టు అనిపిస్తుంది. ఇప్పటికీ తల్లిదండ్రులలో ఆస్తమా పట్ల పెద్దగా అవగాహన లేదు. దీంతో సరైన వైద్యం చేయించడం లేదు. పుట్టగానే కృత్రిమ శ్వాస అవసరమైనవారు, ఉమ్మడి కుటుంబాల్లో కిక్కిరిసిన జన సమూహాల మధ్య పెరిగేవారు, సరైన వసతుల్లేని డే-కేర్ సెంటర్లలో ఉండే బిడ్డలు ఆస్తమా బారినపడే ఆస్కారం ఎక్కువ. తల్లిపాలు తాగని పిల్లలను ఆస్తమా కబళించే ప్రమాదం ఉంది. పొగతాగే పెద్దల వల్ల కూడా ఆ ఇంట్లోని చిన్నారులు ఆస్తమా బారినపడవచ్చు.
ఇవీ కారణాలు..
ఇంట్లోని దుమ్మూధూళిలో నివసించే డస్ట్‌మైట్ అనే సూక్ష్మజీవితో పాటు బొద్దింకలు, జంతువుల లాలాజలం, బొచ్చు.. ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. చల్లగాలి, స్ప్రేలు, దోమల నివారణకు వాడే కాయిల్స్, వాతావరణంలో హఠాత్తుగా వచ్చే మార్పులు కూడా ఈ వ్యాధిని ప్రేరేపిస్తాయి.
లక్షణాలు- వైద్యం
తుమ్ములు, ముక్కు కారడం, ముక్కులో దురద, రాత్రిళ్ల్లు ఎడతెరపిలేని దగ్గు, దాంతోపాటే వాంతులు, కొన్నిసార్లు.. ఛాతీలోంచి శబ్దాలు, శ్వాసక్రియ వేగం పెరగడం, ఛాతీ పట్టేసినట్టు అనిపించడం.. ప్రధాన లక్షణాలు. వ్యాధి తీవ్రతనుబట్టి వైద్యులు సూచించిన మందులను వాడాలి. సమస్య తరచూ వేధిస్తుంటే డాక్టరు సలహాతో ఇన్హేలర్స్ ఉపయోగించవచ్చు. వీటిని ఎక్కువ కాలం వాడితే భవిష్యత్తులో ఆ మత్తుకు బానిసలు అవుతారన్నది అపోహ మాత్రమే.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Asthma
- lung disease
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

