Zinc Deficiency Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే మీకు జింక్ లోపం ఉన్నట్లే..!
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు అనేక రకాల పోషకాలు అవసరమని అందరికీ తెలిసిందే. పోషకాల విషయానికి వస్తే వాటిల్లో విటమిన్లు, మినరల్స్ చాలా ముఖ్యమైనవి. మినరల్స్ మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
Zinc Deficiency Symptoms | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు అనేక రకాల పోషకాలు అవసరమని అందరికీ తెలిసిందే. పోషకాల విషయానికి వస్తే వాటిల్లో విటమిన్లు, మినరల్స్ చాలా ముఖ్యమైనవి. మినరల్స్ మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిల్లో జింక్ అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు జింక్ అవసరం అవుతుంది. అలాగే గాయాలు త్వరగా మానడానికి, మెదడు పనితీరుకు, చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉండేందుకు, కంటి చూపు కోసం కూడా జింక్ ఉపయోగపడుతుంది. అయితే మన శరీరంలో జింక్ లోపం ఉంటే పలు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి జింక్ లోపం ఏర్పడిందని తెలుసుకుని జింక్ ఉండే ఆహారాలను తింటుంటే ఈ లోపం నుంచి బయట పడవచ్చు. అలాగే అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. జింక్ లోపం ఉంటే మన శరీరం మనకు ఎలాంటి సంకేతాలను ఇస్తుందంటే..
రోగ నిరోధక వ్యవస్థ..
మన శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు జింక్ అవసరం అవుతుంది. అయితే జింక్ లోపిస్తే రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండదు. దీంతో తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. లేదా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చినా ఒక పట్టాన తగ్గవు. చాలా కాలం పాటు రోగాలు అలాగే ఉంటాయి. ముఖ్యంగా తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. గాయాలు త్వరగా మానవు. పుండ్లు పడతాయి. ఈ లక్షణాలు కనిపిస్తుంటే జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే జింక్ లోపం వల్ల ఆకలి కూడా ఉండదు. మీకు అసలు ఆకలి సరిగ్గా లేకపోయినా కూడా జింక్ లోపంగానే భావించాలి. జింక్ లోపం వల్ల మన నాలుక రుచి చూసే శక్తిని, ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోతాయి. దీంతో ఆహారం రుచిగా ఉండదు. అలాగే ఆకలిగా కూడా అనిపించదు.
చర్మం, శిరోజాలు..
జింక్ లోపం ఉంటే జుట్టు పలుచబడి చిట్లిపోతుంది. జుట్టు కుదుళ్లు, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే జింక్ అవసరం అవుతుంది. జింక్ లోపిస్తే జుట్టు సమస్యలు ఎక్కువవుతాయి. జుట్టు బాగా రాలిపోతుంది. అలాగే తలలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. చుండ్రు ఏర్పడుతుంది. రాలుతున్న జుట్టు మళ్లీ రాదు. ఈ లక్షణాలన్ని జింక్ లోపాన్ని సూచిస్తాయి. అలాగే జింక్ లోపం వల్ల చర్మ సమస్యలు సైతం వస్తుంటాయి. ముఖ్యంగా చర్మంపై దురదలు ఏర్పడుతాయి. దద్దుర్లు వస్తుంటాయి. ముఖంపై మొటిమలు కూడా వస్తాయి. ఇతర చర్మ వ్యాధులు కూడా వస్తుంటాయి. ఇవన్నీ జింక్ లోపాన్ని సూచిస్తాయి.
జీర్ణ వ్యవస్థ..
మన జీర్ణ వ్యవస్థ పనితీరుకు జింక్ అవసరమే. అలాగే మెటబాలిజంను క్రమబద్దీకరించేందుకు కూడా జింక్ ఉపయోగపడుతుంది. జింక్ లోపం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తరచూ విరేచనాల బారిన పడుతుంటారు. కొందరికి మలబద్దకం కూడా ఉంటుంది. తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. మెదడు పనితీరుకు కూడా జింక్ పనిచేస్తుంది. జింక్ లోపిస్తే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దేనిపై కూడా దృష్టి పెట్టలేరు. ఏకాగ్రత తగ్గిపోతుంది. మానసికంగా అనారోగ్యంగా ఉన్నట్లు డల్‌గా ఫీలవుతారు. ఈ లక్షణాలన్నీ జింక్ లోపం వల్ల కనిపించేవే. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. జింక్ లోపిస్తే డాక్టర్లు ఇచ్చే మందులను వాడాలి. అలాగే జింక్ ఉండే ఆహారాలను తింటుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- zinc foods
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

