బ్లాక్ హెడ్స్ వేధిస్తున్నాయా.. అయితే ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
Health tips | చాలామందిని వేధిస్తున్న చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి. బ్లాక్ హెడ్స్ అంటే చర్మంపై చిన్నసైజులో వచ్చే నల్లని కురుపుల్లాంటి మచ్చలు. ఇవి తొలగించినాకొద్ది
Health tips: చాలామందిని వేధిస్తున్న చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి. బ్లాక్ హెడ్స్ అంటే చర్మంపై చిన్నసైజులో వచ్చే నల్లని కురుపుల్లాంటి మచ్చలు. ఇవి తొలగించినాకొద్ది పదేపదే వస్తుంటాయి. మృతకణాలు చర్మ రంధ్రాలను పూడ్చేయడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది. కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చర్మంపై గల చిన్న రంధ్రాల్లో డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడంవల్ల నల్లటి మచ్చలు వస్తాయి. ముక్కు, గదమ మీద ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని తొలగించే కొన్ని చిట్కాలు మీ కోసం..
నీటి ఆవిరి
ఒక వంటపాత్రలో నీటిని తీసుకుని వేడి చేయాలి. ఆ తర్వాత నీటి ద్వారా వచ్చే అవిరిపై టవల్‌ను పెట్టాలి. వెంటనే ఆ టవల్‌ను బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉన్న చోట సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా మూడుసార్లు చేస్తే బ్లాక్ హెడ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
పెరుగు, శనగపిండి, కాఫీ పొడి
చిక్కటి పెరుగు, శనగపిండి, కాఫీపొడి కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై అప్లై చేసి చేతులతో తేలికగా మసాజ్ చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలపాటు మసాజ్ చేసి, ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. అనంతరం ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోవద్దు. వారానికి రెండు సార్లు ఇలా మసాజ్ చేయడంవల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
గుడ్డు తెల్లసొన, బేకింగ్ సోడా
గుడ్డులోని తెల్లసొనలో రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా మిక్స్ చేసి ముఖానికి 15 నుంచి 20 నిమిషాలపాటు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత చేతులతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేసుకోవచ్చు. దీంతో నల్లమచ్చలు త్వరగా తగ్గిపోతాయి.
పుదీనా ఆకుల పేస్ట్
పుదీనా ఆకుల పేస్టును ఉపయోగించడం ద్వారా సులభంగా బ్లాక్ హెడ్స్‌ను దూరం చేసుకోవచ్చు. అందు కోసం ముందుగా పుదీనా ఆకులు, చిటికెడు పసుపును నీటిలో వేసి మరిగించాలి. ఆకులను మెత్తగా చేసి ముఖానికి పట్టించి కాసేపు అలాగే వదిలేయాలి. అనంతరం చేతులతో సుతిమెత్తగా మసాజ్ చేయాలి. ఇప్పుడు గోరువెచ్చని లేదా సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

