Tomatoes | టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా? అది చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
Tomatoes | ఏ కూర వండినా టమాటాలు మస్ట్‌గా ఉండాల్సిందే. ఒక్క టమాటా వేసినా సరే ఆ కూర టేస్టే మారిపోతుంది. అందుకే టమాటాలను ఎప్పుడూ కిచెన్‌లో స్టాక్ పెట్టుకుంటుంటారు. ఒకేసారి టమాటాలను మార్కెట్లో కొని తెచ్చుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు.
Tomatoes | ఏ కూర వండినా టమాటాలు మస్ట్‌గా ఉండాల్సిందే. ఒక్క టమాటా వేసినా సరే ఆ కూర టేస్టే మారిపోతుంది. అందుకే టమాటాలను ఎప్పుడూ కిచెన్‌లో స్టాక్ పెట్టుకుంటుంటారు. ఒకేసారి టమాటాలను మార్కెట్లో కొని తెచ్చుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. వారం పదిరోజుల పాటు వాటిని కూరల్లో వేస్తుంటారు. కానీ టమాటాలను అలా ఫ్రిజ్‌లో పెట్టడం చాలా డేంజర్ అని సైంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజులు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసిన టమాటాలు విషంతో సమానమని చెబుతున్నారు.
– టమాటాలను ఫ్రిజ్‌లో పెడితే వాటి సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయి. 39 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద టమాటాలను ఉంచినప్పుడు వాటి రుచి, వాసనను ఎలా కోల్పోతుందనేది పలు పరిశోధనల్లోనూ వెల్లడైంది.
– ఒకటి రెండు రోజులు అంటే ఫర్లేదు కానీ.. అంతకంటే ఎక్కువ రోజులు మాత్రం టమాటాలను ఫ్రిజ్లోపెట్టకూడదు. దీనివల్ల డీఎన్ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయి. సాధారణంగా ఒక జీవి డీఎన్ఏకు అనుగుణంగా పనితీరును మార్చే ప్రక్రియను మిథైలేషన్ అని పిలుస్తారు. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సక్రమంగా లేకపోతే అసాధారణ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మనం టమాటాలను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు పెట్టడం వల్ల ఈ మిథైలేషన్లోనే మార్పులు వచ్చి రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది.
– ఎక్కువ రోజులు టమాటాలను పెట్టడం వల్ల వాటి లోపల ఉండే జెల్లీ విరిగిపోతుంది. అంటే లోపల అంతా జ్యూసీగా మారిపోతుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం అంత మంచిది కాదు.
– టమాటాలు పండినప్పుడు ఇథలీన్‌ను విడుదల చేస్తాయి. అయితే ఫ్రిజ్‌లో చల్లదనం కారణంగా ఇథలీన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దీనివల్ల టమాటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి. అందుకే టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే చల్లదనంలో కూడా టమాటాలు రుచిని, తమ సహజ లక్షణాన్ని కోల్పోకుండా ఉండేలా పరిశోధనలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
టమాటాలు ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచాలి?
– టమాటాలు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడే అవి.. వాటి సహజ లక్షణాన్ని కోల్పోకుండా తాజాగా ఉంటాయి. కానీ వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేం. అందుకే టమాటాలను కొనేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బాగా పండిన టమాటాలను కొనవద్దు. కొన్ని దోరగా ఉన్నవి.. కొన్ని కాయల్లా ఉన్నవి కొనాలి. ఇలా తీసుకోవడం వల్ల టమాటాలను వాడుకునే సమయానికి పక్వానికి వచ్చేస్తాయి.
– టమాటాలను స్టోర్ చేసేటప్పుడు వాటి కాండం తీసేయాలి. కాండం ఉండటం వల్ల టమాటాలు చాలా తొందరగా పండుతాయి. దీనివల్ల కుళ్లిపోయే అవకాశం ఉంటుంది.
– టమాటాలను స్టోర్ చేసేటప్పుడు సూర్యరశ్మి తగలకుండా ఉంచాలి. ఇందుకోసం పాలిథీన్ కవర్లో భద్రపరచాలి. దీనివల్ల చాలా కాలం టమాటాలు తాజాగా ఉంటాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

