Over Sweating | అధికంగా చెమట పట్టడం, ఎక్కువ సేపు ఉండడం.. దేనికి సంకేతం, ఏం చేయాలి..?
చెమట పట్టడం శరీరం సహజంగా ఉష్ణోగ్రతను నియంత్రించుకునే విధానం. చర్మంలో ఉన్న స్వేద గ్రంథులు చెమటను ఉత్పత్తి చేస్తాయి. ఇవి శరీరం మొత్తం ఉన్నప్పటికీ నుదురు, చంకలు, అరచేతులు, పాదాలు వంటి భాగాల్లో ఎక్కువగా ఉంటాయి. చెమటలో నీరు మాత్రమే కాకుండా ఉప్పు కూడా ఉంటుంది.
Over Sweating | చెమట పట్టడం శరీరం సహజంగా ఉష్ణోగ్రతను నియంత్రించుకునే విధానం. చర్మంలో ఉన్న స్వేద గ్రంథులు చెమటను ఉత్పత్తి చేస్తాయి. ఇవి శరీరం మొత్తం ఉన్నప్పటికీ నుదురు, చంకలు, అరచేతులు, పాదాలు వంటి భాగాల్లో ఎక్కువగా ఉంటాయి. చెమటలో నీరు మాత్రమే కాకుండా ఉప్పు కూడా ఉంటుంది. చెమట ఆవిరైపోతే చర్మం చల్లబడుతుంది, దీంతో శరీర ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉంటుంది. అయితే చెమట కేవలం చల్లబరచడం మాత్రమే కాదు, అది ఆరోగ్యం గురించి కూడా ముఖ్యమైన సంకేతాలు ఇస్తుంది. చెమటను ఒక సైలెంట్ బయోమార్కర్ గా పరిగణిస్తారు. హార్మోన్ అసమతుల్యతల నుంచి మెటబాలిక్, న్యూరాలజికల్ సమస్యల వరకు అనేక గోప్యమైన ఆరోగ్య సమస్యలను ఇది తెలియజేస్తుంది.
మొత్తం శరీరానికి చెమట పడితే..
మొత్తం శరీరానికి అధికంగా చెమట పట్టడం (హైపర్హైడ్రోసిస్) ఒక హెచ్చరిక సంకేతంగా భావించాలి. చల్లని గదిలో లేదా విశ్రాంతి సమయంలో కూడా చెమట ఎక్కువగా పడితే, అది హైపర్‌థైరాయిడిజం, డయాబెటిస్, ఇన్ఫెక్షన్లు, మెనోపాజ్ లేదా లింఫోమా వంటి వ్యాధుల సూచన అయ్యే చాన్స్ ఉంటుంది. ఇలాంటి చెమట రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే వైద్యుడిని సంప్రదించడం అవసరం. చేతులు, పాదాలు లేదా ముఖం వంటి నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే చెమట రావడం ఫోకల్ హైపర్హైడ్రోసిస్ గా పిలుస్తారు. ఇది సాధారణంగా ప్రమాదకరం కాకపోయినా, మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సంబంధం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో హార్మోన్ మార్పులు లేదా కొన్ని మందులు తీసుకోవడం వల్ల కూడా ఇది పెరుగుతుంది. రాత్రిపూట చెమటలు (నైట్ స్వెట్స్) ఒక ముఖ్యమైన సంకేతం. చల్లని వాతావరణంలో కూడా చెమటతో మెళకువ రావడం ట్యూబర్క్యులోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్ సమస్యలు, మెనోపాజ్, లింఫోమా వంటి వ్యాధులను సూచించే అవకాశాలు ఉంటాయి. ఇది బరువు తగ్గడం, అలసట, జ్వరం వంటి లక్షణాలతో ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు.
తక్కువ చెమట పడితే..
కొంతమందికి చెమట తక్కువగా పడుతుంది (అన్హైడ్రోసిస్). ఇది నరాల దెబ్బతినడం, చర్మ వ్యాధులు లేదా జన్యుపరమైన సమస్యల వల్ల అయ్యే అవకాశాలు ఉంటాయి. చెమట తక్కువగా పడితే శరీరం చల్లబడలేక హీట్ ఎగ్జాస్షన్, హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చెమట చాలా ఉప్పుగా ఉండటం లేదా చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడటం అధిక ఎలక్ట్రోలైట్ నష్టాన్ని సూచిస్తుంది. ఎక్కువసేపు చెమట పట్టే వారు సోడియం లోపం (హైపోనాట్రేమియా) ప్రమాదంలో ఉంటారు. చెమట పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం (పాల్పిటేషన్స్), ముఖం ఎర్రబడటం వంటి లక్షణాలు హార్మోన్ లేదా రక్తనాళ సమస్యలను సూచిస్తాయి. ఫియోక్రోమోసైటోమా వంటి అరుదైన ట్యూమర్లు లేదా హైపర్‌థైరాయిడిజం ఈ లక్షణాలకు కారణం అవుతాయి. ఇవి సాధారణంగా అధిక రక్తపోటు, తలనొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలతో కూడి ఉంటాయి. చెమట వాసనలో మార్పులు కూడా అనారోగ్య సంకేతాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అసాధారణమైన, గట్టిగా ఉండే వాసన మెటబాలిక్ లేదా హార్మోనల్ మార్పులను సూచిస్తుంది. డయాబెటిస్ లేదా కిడ్నీ వ్యాధుల్లో లోహం లేదా అమోనియా వాసనలా అనిపిస్తుంది. కొన్ని మందులు లేదా ఇన్ఫెక్షన్లు కూడా చెమట వాసనను మారుస్తాయి. చెమటను నిర్లక్ష్యం చేయకుండా, దాని విధానంలో మార్పులను గమనించడం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

