Bald Hair | బట్టతల మగవారికే ఎందుకొస్తుంది ? ఆడవారికి రాదెందుకు..?
Bald Hair | ప్రస్తుత జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల బట్టతల మనుషుల్లో పెను సవాలుగా మారింది. దీంతో కొందరు మానసిక ఇబ్బందితో బాధ పడుతుండగా మరికొందరు ఉన్న జుట్టును కాపాడుకోవాడానికి నానా తంటాలు పడుతున్నారు.
ప్రస్తుత జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల బట్టతల(Badl Hair) మనుషుల్లో పెను సవాలుగా మారింది. దీంతో కొందరు మానసిక ఇబ్బందితో బాధ పడుతుండగా మరికొందరు ఉన్న జుట్టును కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ సమస్య మగవారి(Mens) లోనే ఎందుకు వస్తుంది. ఆడవారి(Womens)లో కనిపించక పోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి.

గాలి, నీరు, ఆహారం కలుషితంతో పాటు సరైన పోషక ఆహారం (Food) తీసుకోకపోవడం బట్టతలకు కారణమని, జన్యు లోపం(Genetic defect), వంశపారంపర్యంగా(Hereditary) ఇది వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మనం చేసే పనుల్లో ఒత్తిడికి గురై శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయని, మానసిక ఆందోళనలు ఇందుకు మరో కారణమని వైద్యులు వివరిస్తున్నారు.
పురుషుల్లో బట్టతల రావడానికి టెస్టోస్టెరీన్ (Testosterin) ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల టెస్టోస్టెరీన్ డిహైడ్రో టెస్టోస్టెరీన్ మారి వెంట్రుకలు రాలిపోగా కొత్తగా రాకపోవడంతో బట్టతల ఏర్పడుతుంది. అయితే ఆడవారిలో మాత్రం ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే ఆడవాళ్లలో బట్టతల ఎక్కువగా ఉండదు. చాలా అరుదుగా మాత్రమే రావడం జరుగుతుంది.

యుక్త వయస్సు వచ్చిన తరువాత జన్యులోపాలను, ఇంట్లో ఎవరికైనా బట్టతల ఉంటే ముందస్తుగా వైద్యులను (Doctors) సంప్రదించి వారిచ్చే సలహాలు, సూచనలు పాటిస్తే కొంత మేరనైనా జుట్టు ఊడకుండా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
మందులు కూడా కారణమా ?

కొన్ని రకాల మందులు బట్టతలకు కారణం అవుతాయి. క్యాన్సర్(Cancer), అధిక రక్తపోటు, డిప్రెషన్, ఆర్థరైటిస్ ట్రీట్మెంట్కు వాడే మందులు జుట్టు రాలడానికి కారణమవుతాయి. ఏదైనా మందులు వాడే ముందు జుట్టు రాలే ప్రమాదం గురించి వైద్యులతో మాట్లాడ సలహాలు పాటిస్తే మేలు జరుగుతుంది.
పోషకాహార లోపం

పోషకహారలోపం కారణంగా.. జుట్టు రాలే అవకాశం ఉంది. విటమిన్లు ఎ, సి, డి, ఇ, బయోటిన్, ఐరన్ సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకుంటే.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, బట్టతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నాణ్యత లేని సబ్బులు వాడడం కూడా జుట్టు రాలడానికి ఒక కారణమని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- baldness
- men
- Testosterin
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

