Hair Problems | జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..?
సాధారణంగా ఎదురయ్యే జుట్టు సమస్యలను బయటి చికిత్సలతో మాత్రమే కాకుండా ఆహారం ద్వారా కూడా నియంత్రించవచ్చని, సరైన పోషకాలు తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని లోపల నుంచి మెరుగుపరచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జుట్టు సమస్యలు చాలా సాధారణమయ్యాయి.
Hair Problems | సాధారణంగా ఎదురయ్యే జుట్టు సమస్యలను బయటి చికిత్సలతో మాత్రమే కాకుండా ఆహారం ద్వారా కూడా నియంత్రించవచ్చని, సరైన పోషకాలు తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని లోపల నుంచి మెరుగుపరచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జుట్టు సమస్యలు చాలా సాధారణమయ్యాయి. జుట్టు రాలడం, పొడి జుట్టు, డాండ్రఫ్, ముందస్తు తెల్లజుట్టు వంటి సమస్యలు చాలామందిని బాధిస్తున్నాయి. ఇలాంటి సమస్యలు వస్తే చాలామంది మొదట షాంపూ లేదా ఇతర ట్రీట్మెంట్స్ మార్చడానికి ప్రయత్నిస్తారు. అయితే చాలా మంది తీసుకునే ఆహారం కూడా జుట్టు ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుంది. శరీరంలో విటమిన్లు, ఖనిజాలు తగ్గితే మొదట ప్రభావం జుట్టుపై కనిపిస్తుంది. అందుకే రోజువారీ ఆహారంపై దృష్టి పెట్టడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జుట్టు సమస్యలకు సరైన ఆహారాన్ని అనుసంధానం చేస్తూ కొన్ని సులభమైన సూచనలను కూడా వారు సూచిస్తున్నారు. జుట్టు సమస్యలతో బాధపడే వారు భోజనంలో ఎటువంటి ఆహారాలను తీసుకోవాలో వైద్యులు వివరిస్తున్నారు.
పాలకూర, కరివేపాకు, అవిసె గింజలు..
జుట్టు రాలడం సమస్య ఉంటే పాలకూరను ఆహారంలో చేర్చడం మంచిది. ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదళ్లకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచి పెరుగుదలకు సహాయపడతాయి. ముఖ్యంగా మహిళల్లో ఐరన్ లోపం జుట్టు రాలడానికి ప్రధాన కారణంగా ఉంటుంది. తెల్లజుట్టు సమస్యతో బాధపడే వారు కరివేపాకును తీసుకోవడం మంచిది. కరివేపాకు కేవలం రుచికోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి తల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి సహజ జుట్టు రంగును కాపాడటానికి సహాయపడతాయి. పొడి, వెలిసిన జుట్టు ఉన్న వారు ఆవిసె గింజలను (ఫ్లాక్స్ సీడ్స్) ఆహారంగా తీసుకోవాలి. ఆవిసె గింజలు ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు మంచి వనరు. ఇవి తల చర్మాన్ని పోషించి తేమను పెంచుతాయి. దీని వల్ల జుట్టు మెత్తగా, మెరిసేలా మారుతుంది.
పెరుగు, బాదంపప్పు..
డాండ్రఫ్ సమస్యతో బాధపడే వారు పెరుగును ఆహారంగా తీసుకోవాలి. పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి తల చర్మాన్ని సమతుల్యం చేసి పొడి, చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో పెరుగు చేర్చడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంతో పాటు జుట్టు కుదుళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బలహీనమైన, సులభంగా విరిగే జుట్టు ఉన్న వారు బాదంను ఆహారంగా తీసుకోవాలి. బాదంలో బయోటిన్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు తంతువులను బలపరచి కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అదనంగా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా జుట్టు బలానికి సహాయపడతాయి. జుట్టు సమస్యల పరిష్కారం కోసం బయట చికిత్సలపై మాత్రమే ఆధారపడకుండా రోజువారీ ఆహారంపై దృష్టి పెట్టాలి. జుట్టు ఆరోగ్యం ఒక్కరోజులో మారదు. కానీ సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే క్రమంగా బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు పొందవచ్చు. కొన్నిసార్లు మంచి జుట్టు ఆరోగ్యం ఆహారపు అలవాట్ల నుంచే ప్రారంభమవుతుందని చిన్న మార్పులు పెద్ద ఫలితాలను అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- hair problems
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

