స్లీప్ ఆప్నియా.. దీన్నే దీర్ఘకాలిక నిద్రలేమి అంటారు. ఇది తీవ్రమైన స్లీప్ డిజార్డర్. నిద్రలో శ్వాస కొద్ది సేపు ఆగిపోతుంది. దీంతో మధ్యలో మెలకువ వస్తుంటుంది. శ్వాస సక్రమంగా లేనందువల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గి, నిద్రలో చాలా సార్లు ఇలా జరగొచ్చు. స్లీప్ ఆప్నియా తీవ్రంగా ఉంటే మాత్రం గంటకు ఐదు నుంచి వందసార్లు నిద్రాభంగం కలుగుతుంది. అలాగే, ఈ రుగ్మతతో బాధపడే వారిలో చాలాసార్లు శ్వాస తీసుకోవడం ఆగిపోయి, బిగ్గరగా గురక పెట్టడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే అప్నియాతోపాటు పెద్ద సంఖ్యలో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
ఈ వ్యాధి హైపర్ టెన్షన్, స్ట్రోక్, కార్డియోమయోపతి, గుండె వైఫల్యం, గుండెపోటు, మధుమేహంలాంటి ప్రాణాంతక పరిస్థితులకు కూడా కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది పురుషులు, 10 శాతం మంది మహిళలు స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు, ఇది పిల్లలు, పసిబిడ్డలతో సహా ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేస్తుంది. ఊబకాయం, టాన్సిల్స్, పొడవాటి మెడ, ముఖ అసాధారణతలులాంటి కొన్ని శారీరక లక్షణాలు ఉన్నవారిలో ఎక్కువగా స్లీప్ ఆప్నియా కనిపిస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు.
స్లీప్ ఆప్నియాతో శరీరంలో ఏం జరుగుతుంది..?
స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నవారిలో శ్వాస తరుచూ ఆగిపోతూ ఉంటుంది. దీంతో శరీరానికి ఆక్సిజన్ సరఫరా సరిగా జరుగక హార్ట్ బీట్ గణనీయంగా పడిపోతుంది. దీంతో అసంకల్పితంగా కండరాలు పనిచేయడం ప్రారంభించి, హార్ట్బీట్తోపాటు రక్తపోటును పెంచుతాయి. రక్తపోటు పెరగడంతో గుండె గోడలు గట్టిపడి హార్ట్కూడా స్టిఫ్‌గా మారిపోతుంది. ఇది గుండె సంబంధ వ్యాధులు, హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు.
స్లీప్ ఆప్నియా లక్షణాలు..
గురక అనేది స్లీప్ ఆప్నియా మొదటి లక్షణం. ఈ రుగ్మతతో బాధపడేవారిని వారితో కలిసి నిద్రించేవారు గుర్తించొచ్చు. గురక అనేది సాధారణ సంకేతం. దీంతో పాటు ఈ కింది లక్షణాలు కనిపిస్తే అది స్లీప్ ఆప్నియాగా నిర్ధారించొచ్చు.
స్లీప్ ఆప్నియా చికిత్స..
స్లీప్ ఆప్నియా లక్షణాలు కొద్దిమేర ఉంటే చికిత్స అవసరం ఉండదు. అధిక బరువు తగ్గడంతోపాటు కొన్ని రకాల నిద్ర మాత్రలు, శ్వాస వ్యాయామాలను వైద్యులు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో సైనస్ లేదా నాసికా రద్దీకి చికిత్స పొందడంలాంటి కన్జర్వేటివ్ థెరపీ చేస్తారు. ఇక స్లీప్ ఆప్నియా తీవ్రంగా ఉంటే రోగులకు మెకానికల్ థెరపీలు, నాసికా మార్గంలో అడ్డంకిని సరిచేసేందుకు శస్త్రచికిత్సను కూడా వైద్యులు సూచిస్తారు.