Cardamom | భోజనాన్ని రుచికరమైన మౌత్ ఫ్రెషర్ తో ముగియడం భారతదేశం పాత సంస్కృతిలో ఒక భాగం. భోజనం చేసిన తరువాత జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇలా చేస్తూ ఉంటారు. మౌత్ ఫ్రెషర్ గా ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటారు. మనం మౌత్ ఫ్రెషర్ గా వాడే సుగంధ ద్రవ్యాలల్లో యాలకులు ఒకటి. మౌత్ ఫ్రెషర్ గా వీటిని చాలా తక్కువ మంది వాడతారనే చెప్పవచ్చు. యాలకులు మంచి వాసనతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో లక్షణాలను కలిగి ఉంటాయి. వంటల్లో వీటిని వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతుందని చెప్పవచ్చు. యాలకులను ఆయుర్వేదంలో కూడా ఎంతో కాలంగా ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. భోజనం చేసిన తరువాత యాలకులను నమలడం వల్ల మనకు మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తరువాత యాలకులను నమలడం వల్ల కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన తరువాత యాలకులను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇందులో ఉండే సుగంధ నూనెలు నోటిలో ఉండే బ్యాక్టీరియాతో పోరాడతాయి. దీంతో నోట్లో దుర్వాసన తగ్గుతుంది. భోజనం చేసిన తరువాత నోటి నుండి ఉల్లిపాయ లేదా వెల్లుల్లి వాసన వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక యాలక్కాయను నమలడం వల్ల వాసన తగ్గడంతో పాటు నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే యాలకులలో సినోల్ వంటి సహజ సమ్మేళనాలు, అవసరమయ్యే నూనెలు ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. భోజనం చేసిన తరువాత యాలకులను నమలడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. యాలకులను నమలడం వల్ల భారీ భోజనం చేసిన తరువాత వచ్చే అసౌకర్యం, భారం తగ్గుతాయి.
అదే విధంగా యాలకులల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కాలేయం, మూత్రపిండాల డిటాక్సిఫికేషన్ ప్రక్రియను ప్రోత్సహించే సమ్మేళనాలు కూడా ఉంటాయి. దీంతో శరీరం నుండి విషపదార్థాలు సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా యాలకులను నమలడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. యాలకులు చిన్నగా ఉన్నప్పటికీ వీటిని తీసుకోవడం వల్ల రోజువారి ఆరోగ్యం, జీర్ణ సమతుల్యతను కాపాడడంలో మనకు ఎంతో సహాయపడతాయి. భోజనం చేసిన తరువాత యాలకులను తీసుకోవడం వల్ల భోజనం చేసిన తరువాత తీపి తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో యాలకులు బరువు నియంత్రణకు సహాయక సాధనంగా మారతాయి. ఇలా అనేక రకాలుగా యాలకులు మనకు మేలు చేస్తాయని భోజనం తరువాత వీటిని నమలడం వల్ల నోటి ఆరోగ్యంతో పాటు జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి మంచి మౌత్ ఫ్రెషర్ గా పనిచేయడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని వారు తెలియజేస్తున్నారు.