Carbohydrates | పిండి పదార్థాలను తినడం పూర్తిగా మానేస్తే ఏమవుతుంది..?
కార్బోహైడ్రేట్లు (Carbohydrates) శరీరానికి ప్రధాన శక్తి వనరు. రోజువారీ పనులను చేయడానికి అవసరమైన ఎనర్జీని ఇవే అందిస్తాయి. వీటిని తీసుకున్నప్పుడు అవి మొదట జీర్ణవ్యవస్థలో విచ్ఛిన్నమై గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తాయి. దీనినే బ్లడ్ షుగర్ అని అంటారు. తర్వాత శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేసి ఆ గ్లూకోజ్‌ను కణాలకు చేరవేసి శక్తిగా ఉపయోగిస్తుంది.
Carbohydrates | కార్బోహైడ్రేట్లు (Carbohydrates) శరీరానికి ప్రధాన శక్తి వనరు. రోజువారీ పనులను చేయడానికి అవసరమైన ఎనర్జీని ఇవే అందిస్తాయి. వీటిని తీసుకున్నప్పుడు అవి మొదట జీర్ణవ్యవస్థలో విచ్ఛిన్నమై గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తాయి. దీనినే బ్లడ్ షుగర్ అని అంటారు. తర్వాత శరీరం ఇన్సులిన్‌ను విడుదల చేసి ఆ గ్లూకోజ్‌ను కణాలకు చేరవేసి శక్తిగా ఉపయోగిస్తుంది. అదనంగా ఉన్న గ్లూకోజ్‌ను కాలేయం, కండరాల్లో నిల్వ చేస్తుంది. అవి కూడా నిండిపోయినప్పుడు, మిగిలిన గ్లూకోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. అందువల్ల పిండి పదార్థాలను అధికంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరగడం, ఫ్యాట్ నిల్వ కావడం జరుగుతుంది. ఈ కారణాలతోనే చాలా మంది కార్బ్స్ (పిండి పదార్థాలు) తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కార్బ్స్‌ను పూర్తిగా మానేయడం లేదా చాలా తక్కువగా తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంది. శరీరం తక్షణ గ్లూకోజ్‌పై ఆధారపడటం నుంచి కొవ్వును శక్తిగా ఉపయోగించే విధానానికి మారుతుంది. ఈ మార్పు వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ, కొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
శరీరంలోని శక్తి నిల్వ గ్లైకోజెన్..
కాలేయం, కండరాల్లో కార్బోహైడ్రేట్లు గ్లైకోజెన్ రూపంలో నిల్వ ఉంటాయి. ప్రతి గ్రాము గ్లైకోజెన్తో సుమారు మూడు గ్రాముల నీరు కూడా నిల్వ ఉంటుంది. కార్బ్స్ తగ్గించినప్పుడు ఈ నిల్వలు ఒకటి నుంచి రెండు రోజుల్లో తగ్గిపోతాయి. దీనివల్ల మొదట బరువు త్వరగా తగ్గినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇది నీటి కోత కారణంగా జరుగుతుంది. నీటి లోపం వల్ల డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఈ దశలో ఎనర్జీ కూడా తగ్గుతుంది. గ్లైకోజెన్ నిల్వలు తగ్గిన తర్వాత శరీరం కొవ్వు నుంచి కీటోన్స్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీనిని కీటోసిస్ అంటారు. ఈ దశలో శరీరం కొవ్వును ప్రధాన శక్తిగా ఉపయోగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే ప్రారంభంలో కీటో ఫ్లూ అని పిలిచే లక్షణాలు కనిపిస్తాయి. అలసట, మలబద్ధకం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. మెదడు ఎక్కువగా గ్లూకోజ్‌ను ఉపయోగిస్తుంది. కానీ కార్బ్స్ తగ్గించినప్పుడు మొదటి వారంలో ఏకాగ్రత లోపం, మతిమరుపు, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే బ్రెయిన్ ఫాగ్ అంటారు. అయితే రెండు వారాల తర్వాత శరీరం కీటోన్స్‌ను సరిగ్గా వినియోగించడం నేర్చుకుంటుంది. దీంతో మళ్లీ మెదడు పనితీరు మెరుగవుతుంది.
ఈ సమస్యలు వచ్చే అవకాశం..
కార్బ్స్ తగ్గించడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇన్సులిన్ సున్నితత్వం మెరుగవుతుంది. దీనివల్ల ఆకలి తగ్గి, స్వీట్ తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. దీర్ఘకాలంలో డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే గ్లైకోజెన్ తగ్గడం వల్ల నీరు, ఎలక్ట్రోలైట్స్ కూడా తగ్గిపోతాయి. దీంతో కండరాల్లో నొప్పులు, ముడుచుకోవడం, క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట లేదా వ్యాయామం సమయంలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే పొటాషియం, మెగ్నీషియం ఉన్న ఆహారం తీసుకోవడం అవసరం. ఇక కార్బ్స్ తగ్గించడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గి, PCOS వంటి సమస్యల్లో కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఒక్కసారిగా కార్బ్స్‌ను ఎక్కువగా తగ్గిస్తే కార్టిసోల్ పెరిగి ఒత్తిడి పెరగవచ్చు. దీని ప్రభావంగా జుట్టు రాలడం, నిద్ర సమస్యలు రావచ్చు. థైరాయిడ్ పనితీరు కూడా కొంత మందగించవచ్చు. కార్బోహైడ్రేట్స్ ను తగ్గించడం మంచిదే అయినప్పటికీ వీటిని పూర్తిగా మానేయడం కన్నా సమతుల్యంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Carbohydrates
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

