Fish Eggs: చేప గుడ్లతో గుండెకు మేలు.. ఎలాగో తెలుసా..?
Health tips | చేపలు మాత్రమే కాదు, చేపల గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివని, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చేపల గుడ్లు ఎంతో మేలు చేస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్స్
Fish Eggs: చేపలు మాత్రమే కాదు, చేపల గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివని, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చేపల గుడ్లు ఎంతో మేలు చేస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కానీ వాస్తవానికి చాలామంది మార్కెట్లో చేపలను ముక్కలుగా కట్ చేయించి.. వాటిలో గుడ్లు వస్తే తీసేమంటారు. మీరు కూడా గతంలో అలాగే చేసి ఉండవచ్చు. కానీ చేప గుడ్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే మాత్రం ఇకపై ఆ పనిచేయరు. కచ్చితంగా చేప గుడ్లను ఇంటికి తీసుకెళ్లి వండుకు తింటారు.
చేప గుడ్లను ఎలా వండుకోవాలి..?
చేప గుడ్లతో అనేక ప్రయోజనాలు ఉన్నా వాటిని వండటం చాలా మందికి తెలియదు. కానీ అది పెద్ద కష్టమేం కాదు. చేపలు వండినట్లుగానే చేపగుడ్లను కూడా రకరకాలుగా కూరలు వండుకోవచ్చు. ఫ్రై చేసుకుని కూడా తినవచ్చు. వండే విధానం తెలియకపోతే యూట్యూబ్‌లో చూసి మీకు నచ్చిన ఫ్లేవర్‌లో వండుకోవచ్చు.
చేప గుడ్లతో ప్రయోజనాలు..
1. సాధారణంగా చేప గుడ్లలో విటమిన్ A ఉంటుంది. ఈ విటమిన్ A కంటి చూపును కాపాడటంలో తోడ్పడుతుంది. కళ్లకు హాని జరుగకుండా చేస్తుంది.
2. రెగ్యులర్‌గా చేప గుడ్లు తింటే మీ రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి చేపగుడ్లు దివ్యౌషధంలా పనిచేస్తాయి.
3. చేప గుడ్లలో విటమిన్ D కూడా ఉంటుంది. ఇది మీ ఎముకలు, దంతాలను బలంగా తయారు చేస్తుంది. అంతేగాక గుండె జబ్బులు రాకుండా విటమిన్ D కాపాడుతుంది.
4. మతిమరపు సమస్య ఉన్నవారు, అల్జీమర్స్ పేషెంట్లు క్రమం తప్పకుండా చేప గుడ్లు తినాలి. దాంతో సమస్య నుంచి త్వరగా పరిష్కారం లభించే అవకాశం ఉంది.
5. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా చేప గుడ్లు చాలా మంచివి. రెగ్యులర్‌గా చేప గుడ్లను ఆహారంలో తీసుకుంటే బీపీ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

