ChatGPT | వైద్య సలహా కోసం చాట్‌జీపీటీ ఆశ్రయిస్తే చిక్కుల్లో పడతారు
అనారోగ్య లక్షణాల ఆధారంగా గూగుల్‌లో సెర్చ్ చేస్తే కచ్చితమైన సమాచారం లభించకపోవచ్చని అందుకే ఆరోగ్య సమస్యలకు సెర్చింజన్‌ను ఆశ్రయించరాదని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇక చాట్‌జీపీటీ (ChatGPT) విషయంలోనూ ప్రజలను నిపుణులు ఇదే తరహాలో హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ : అనారోగ్య లక్షణాల ఆధారంగా గూగుల్‌లో సెర్చ్ చేస్తే కచ్చితమైన సమాచారం లభించకపోవచ్చని అందుకే ఆరోగ్య సమస్యలకు సెర్చింజన్‌ను ఆశ్రయించరాదని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇక చాట్‌జీపీటీ (ChatGPT) విషయంలోనూ ప్రజలను నిపుణులు ఇదే తరహాలో హెచ్చరిస్తున్నారు. యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఓపెన్ఏఐ లాంఛ్ చేసిన చాట్‌జీపీటీ అనతి కాలంలోనే ప్రజల నుంచి విశేష ఆదరణ సొంతం చేసుకుంది. అయితే వైద్యపరమైన సలహాల కోసం చాట్‌జీపీటీని నమ్ముకుంటే చిక్కుల్లో పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాట్‌జీపీటీ ఫ్రీ వెర్షన్ వైద్యపరమైన ప్రశ్నలకు సరైన సమాచారం ఇవ్వకపోగా కొన్ని సందర్భాల్లో అసంపూర్తిగా, కచ్చితత్వం లేని సమాధానాలు ఇస్తోందని వెల్లడైంది. వైద్య పరమైన మార్గదర్శకాల కోసం చాట్‌జీపీటీపై ఆధారపడే రోగులకు ఇది పెను ముప్పు వంటిదని నిపుణులు స్పష్టం చేశారు. మందుల విషయంలో యూజర్ల ప్రశ్నలకు చాట్‌జీపీటీ ఫ్రీ వెర్షన్ ఇచ్చిన సమాధానాలను లాంగ్ ఐలండ్ యూనివర్సిటీ ఫార్మసిస్టులు ఇటీవల నిర్వహించని అధ్యయనంలో పరిశీలించారు.
ఈ తరహా ప్రశ్నల్లో నాలుగింట మూడో వంతు ప్రశ్నలకు చాట్‌జీపీటీ అసంపూర్తి, అరకొర సమాధానాలు ఇచ్చిందని ఫార్మసిస్టులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. చాట్‌జీపీటీకి పరిశోధకులు 39 ప్రశ్నలు వేయగా కేవలం పది ప్రశ్నలకే సంతృప్తికరమైన సమాధానాలు లభించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మందులకు సంబంధించి మిగిలిన 29 ప్రశ్నలకు చాట్‌జీపీటీ అసంపూర్తి, అసత్యాలతో కూడిన సమాధానాలు ఇచ్చిందని ఈ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.
Read More :
Rapido cabs | ఇప్పటి నుంచి ర్యాపిడోలో కూడా క్యాబ్ సర్వీసులు.. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులో షురూ
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

