Ash gourd Juice | బూడిద గుమ్మడి జ్యూస్ తాగండి.. బోలెడు ప్రయోజనాలు పొందండి..!
మన ఇంటి వద్దనే దొరికే బూడిద గుమ్మడికాయలను మనం లైట్ తీసుకుంటాం. కానీ వీటిని నిత్యం తినేలా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Ash gourd Juice | గుమ్మడి కాయలతో మనం ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటుంటాం. వడియాలుగా పెట్టుకుని కూడా తింటుంటాం. మనం ఎక్కువగా ఆహారాల్లో వాడేవి సాధారణ గుమ్మడికాయలు. రెండో రకం బూడిద గుమ్మడికాయలను కేవలం దిష్టి తగలకుండా ఇంటి ముందు గుమ్మానికి కట్టేందుకు వాడుతుంటాం. వాహన పూజల సమయంలో వినియోగిస్తుంటాం. అయితే, వీటిని నిత్యం తినడం లేదా జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు.
బూడిద గుమ్మడికాయ.. వింటర్ మిలన్, చైనీస్ మిలన్, సఫేద్ కద్దూ.. ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం. గ్రామాల్లో ఇంటి వెనకాలే విరివిగా కాస్తుంటాయి. అయితే, వీటిని తినకుండా మనం లైట్ తీసుకుంటాం. మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు దీనిలో ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, జింక్, కాల్షియం, ఐరన్‌తోపాటు విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ5, బీ6 వంటివి వీటిని తినడం ద్వారా పొందవచ్చు. వీటిలో 96 శాతం నీరు ఉండి డీహైడ్రేషన్ సమస్యల నుంచి రక్షిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహకరిస్తుంది.
వీటిని కూరగా చేసుకోవడం ఇష్టం లేని వారు జ్యూస్‌గా చేసుకుని నిత్యం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు తగ్గించుకోవచ్చు. జీర్ణ సమస్యలు నయమవుతాయి. మలబద్దకం, గ్యాస్, అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటిలో ఉండే కాల్షియం మన ఎముకలను దృఢంగా తయారుచేస్తుంది. రక్తహీనత నుంచి బయటపడేందుకు వీటిలోని ఐరన్ సాయపడుతుంది. పొట్టలో అల్సర్లు తగ్గుతాయి. కడపులో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. నిత్యం ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వైరస్లు, బ్యాక్టీరియల నుంచి రక్షణ పొందవచ్చు.
ఈ జ్యూస్‌లో అధికంగా ఉండే విటమిన్ సీ, బీటా కెరోటిన్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. ఆందోళన, ఒత్తిడి వంటి వాటితో బాధపడే వారు ఈ జ్యూస్ ను ప్రతిరోజూ తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకోవడం వల్ల మంచి నిద్ర పొందవచ్చు. రోజుకు మూడు గ్లాసుల బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో పాటు ఇతర మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

